El Niño Impact: కొబ్బరిబొండాల పైనా ‘ఎల్‌నినో’ ఎఫెక్ట్.. అప్పుడు మూడు, ఇప్పుడు ఆరు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘ఎల్‌నినో’ ప్రభావం కేవలం వాగులు, నదులు, కాలువలకే పరిమితం కాలేదు. ఇప్పుడు కొబ్బరిబొండాల పైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. వర్షాభావం, అధిక ఉష్ణోగ్రతల కారణంగా కొబ్బరి చెట్లలో నీటి శాతం గణనీయంగా తగ్గిపోవడంతో.. బొండాల్లో వచ్చే నీటి పరిమాణం కూడా బాగా తగ్గిపోయింది. దాంతో ప్రస్తుతం వినియోగదారుల డిమాండ్ ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో విక్రయాలు జరగడం లేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో ఒక లీటర్ కొబ్బరినీరు నింపాలంటే మూడు కొబ్బరిబొండాలు సరిపోయేవని, ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో ఒక్కో బొండాలో వచ్చే నీటి పరిమాణం సగానికి తగ్గిపోయిందని వ్యాపారులు అంటున్నారు. ఇప్పుడు ఒక లీటర్ బాటిల్ నింపాలంటే ఆరు కొబ్బరిబొండాలు కోయాల్సి వస్తోందని చెబుతున్నారు. దీంతో వ్యయం పెరిగిపోతుండగా.. లాభాలు పూర్తిగా పడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మార్కెట్లో కొబ్బరిబొండాల ధరలు పెరగడంతో వినియోగదారులు కూడా కొనుగోలుకు వెనుకంజ వేస్తున్నారు.
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
ఒకవైపు బొండాల్లో నీటి పరిమాణం తగ్గడం, మరోవైపు అమ్మకాలు మందగించడం వల్ల వ్యాపారం తీవ్రంగా దెబ్బతింటోందని వ్యాపారులు వాపోతున్నారు. ఎల్‌నినో ప్రభావం ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో కొబ్బరినీటి లభ్యత మరింత తగ్గే అవకాశం ఉందని.. రైతులు, వ్యాపారులు ఇద్దరూ ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రకృతి పరిస్థితులు సాధారణ స్థితికి రావడమే తమకు కాస్త ఊరటనిస్తుందని కొబ్బరిబొండాల వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!