Site icon NTV Telugu

Asaduddin Owaisi: ఒకరు చౌకీదార్‌, మరొకరు దుకాణ్‌దార్‌.. మోడీ, రాహుల్‌పై అసదుద్దీన్ ఫైర్

Asaduddin Owais

Asaduddin Owais

Asaduddin Owaisi: ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీలపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీలు ఒకరు చౌకీదార్(కాపలాదారడు), మరొకరు దుకాణదారుడని(దుకాణం నడిపి వ్యక్తి) విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీల మధ్య ‘దుకాణదారు’, ‘చౌకీదార్’ సెట్టింగ్ ఉందని ఒవైసీ అన్నారు. దేశంలో ముస్లిం ప్రజలపై జరుగుతున్న అణచివేతపై నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీలు మాట్లాడడం లేదని ఒవైసీ అన్నారు.

Read Also: Akhilesh Yadav: మణిపూర్‌లో జీ20 సదస్సును నిర్వహించండి.. కేంద్రంపై అఖిలేష్ మండిపాటు

వాస్తవానికి తనను తాను కాపలాదారుడినని (చౌకీదార్) ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తరుచూ చెప్పుకుంటారు. ఇక రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్ర సందర్భంగా దుకాణం అనే పదాన్ని ఉపయోగించారు. విద్వేషం నిండిన బజార్లో ప్రేమ దుకాణాన్ని తెరుస్తున్నానని ఆయన అన్నారు. అయితే దీన్ని ఉద్దేశిస్తూ దుకాణ్‭దార్ అని ఓవైసీ ప్రయోగించారు. ‘‘ఇద్దరు నేతలు ముస్లిం మైనారిటీల గురించి పట్టించుకోరు. నరేంద్ర మోదీ రాజకీయం ఎలాంటిదో రాహుల్ గాంధీ రాజకీయం కూడా అలాంటిదే. కాకపోతే ఇద్దరి జెండాలే వేరు, అజెండా ఒక్కటే’’ అని అసదుద్దీన్‌ ఓవైసీ అన్నారు. ఆజ్ తక్ G20 సమ్మిట్‌లో ఏఐఎంఐఎం నాయకుడిని తనకు ఆఫర్ చేస్తే ప్రతిపక్ష కూటమి ఇండియాలో చేరతారా అడగగా.. దీనికి ఆయన మాట్లాడుతూ ఆ కూటమిలో చేరే ఆలోచన లేదని చెప్పారు. ఇది ప్రమాదకరమైన ‘మెహబూబా’ అని ప్రతిపక్ష కూటమిని ఉద్దేశించి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీపై పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై తన వైఖరిని స్పష్టం చేసిన ఆయన, భారత రాష్ట్ర సమితి అవిశ్వాస తీర్మానానికి తమ పార్టీ మద్దతు ఇస్తుందని, ప్రతిపక్షాలకు కాదని అన్నారు.

Read Also: Madhyapradesh: ఖజురహో-ఉదయ్‌పూర్ ఇంటర్‌సిటీ రైలు ఇంజిన్‌లో మంటలు

దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) అమలు చేయాలా అని ప్రశ్నించగా.. దాన్ని అమలు చేస్తే ప్రజల మత స్వేచ్ఛ హరించుకుపోతుందన్నారు. యూసీసీ ద్వారా మహిళలకు సాధికారత కల్పించాలనే ప్రశ్నకు గ్యాంగ్ రేప్ బాధితురాలు బిల్కిస్ బానోకు ప్రధాని ఎందుకు న్యాయం చేయలేదని ప్రశ్నించారు. దేశంలో జరగనున్న జీ20 సదస్సు గురించి అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. ఇతర దేశాల జీ20 నేతలకు ‘మణిపూర్‌లో అంతర్యుద్ధం’ చూపిస్తారా అని ప్రశ్నించారు. సమ్మిట్ ముగిశాక ఉమ్మడి ప్రకటన వెలువడే అవకాశం లేదని కూడా వారు తెలిపారు.

Exit mobile version