NTV Telugu Site icon

AP Ministers: రేపు బాధ్యతలు స్వీకరించనున్న ఎనిమిది మంది మంత్రులు..

Ap Ministers

Ap Ministers

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాడిన ఎన్డీయే కూటమిలోని ఎనిమిది మంది మంత్రులు రేపు ( గురువారం) తమ పదవి బాధ్యతలను స్వీకరించనున్నారు. రేపు ఉదయం 7 30 గంటలకి మంత్రి వాసంశెట్టి సుభాష్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆ తర్వాత ఉదయం 9 గంటలకు ఐటీ మంత్రిగా టీజీ భరత్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక, ఉదయం 9.30కి మంత్రి నిమ్మల రామానాయుడు బాధ్యతలు స్వీకరించనున్నారు. అలాగే, ఉదయం 10.30కి గొల్లపల్లి దేవదాయ కమిషనర్ కార్యాలయంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు.

Read Also: Pushpa2 : పుష్ప 2 వాయిదా పై ఫ్యాన్ ఫైర్.. ఏకంగా హీరోకే వార్నింగ్ ఇచ్చాడుగా..

ఇక, రేపు ఉదయం 10.35 గంటలకు మంత్రి సవిత పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆ తర్వాత ఉదయం 11 గంటలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఉదయం 11.15 గంటలకు మంత్రి అనగాని సత్యప్రసాద్ బాధ్యతలు స్వీకరించనున్నారు. అలాగే, సాయంత్రం 5 గంటలకు మంత్రి కందుల దుర్గేష్ బాధ్యతలను చేపట్టనున్నారు. కాగా, ఇవాళ ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. దీంతో పాటు తొలిరోజే తన పరిధిలోని శాఖల హెచ్ఓడీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.