రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో దేశంలో వంట నూనెల సరఫరా భారీగా పడిపోయింది. సుమారు 80 శాతం సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను ఉక్రెయిన్, రష్యాల నుంచే భారత్ దిగుమతి చేసుకుంటోంది. ప్రస్తుతం యుద్ధం కారణంగా సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులు పడిపోయాయి. జనవరిలో సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుబడులు 3,07,684 టన్నులు ఉండగా.. ఫిబ్రవరిలో 1,40,000 టన్నులకు పడిపోయాయి. జనవరిలో పోలిస్తే ఫిబ్రవరిలో సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుబడులు 22 శాతం పడిపోయాయి. దీంతో సన్‌ఫ్లవర్ ఆయిల్‌కు భారీగా గిరాకీ ఏర్పడింది.
ఈ నేపథ్యంలో 10 రోజుల క్రితంతో పోలిస్తే అన్ని వంట నూనెల ధరలు రూ.20 నుంచి రూ.30 వరకు పెరిగాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఆయిల్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం దక్షిణ భారతం, ఒడిశాలోనే 70 శాతం సన్‌ఫ్లవర్ ఆయిల్ వినియోగం ఉంది. అటు పామాయిల్ దిగుబడి కూడా తగ్గిపోవడంతో వాటి ధరలు కూడా పెరుగుతున్నాయి. లీటర్ పామాయిల్ ధర రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి ముందు రూ.125గా ఉంటే ప్రస్తుతం రూ.163గా పలుకుతోంది. లీటర్ పల్లీ నూనె యుద్ధానికి ముందు రూ.148గా ఉండగా ప్రస్తుతం రూ.175కి చేరుకుంది. రైస్ బ్రెయిన్ ఆయిల్ ధర కూడా రూ.126 నుంచి రూ.150కి పెరిగింది.
