NTV Telugu Site icon

Formula E-Car Case: కేటీఆర్ పై ఈడీ కేసు నమోదు..

Ktr Ed

Ktr Ed

ED registers case against KTR: ఫార్ములా ఈ-కార్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఈడీ ఎంట్రీ ఇచ్చింది. ఏసీబీ దర్యాప్తు ఆధారంగా కేసు నమోదు చేసింది ఈడీ. ఫార్ములా ఈ-కార్ రేసులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ కేసు నమోదు చేశారు. మనీలాండరింగ్, ఫెమా ఉల్లంఘన కింద ఈడీ కేసు నమోదు చేసింది. ఫార్ములా ఈ-కార్ రేసులో ప్రమేయం ఉన్న కేటీఆర్, అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిపై ఈడీ కేసు నమోదు చేసింది. ECIR నమోదు చేసినట్లు ఈడీ పేర్కొంది.

Read Also: Supreme court: చట్టాలు భర్తలను దోచుకునే సాధనాలు కాదు.. భరణంపై సుప్రీం కీలక వ్యాఖ్య

కాగా.. గురవారం ఫార్ములా ఈ-కార్‌ రేసు వ్యవహారంలో కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. కేటీఆర్‌తో పాటు ఐఏఎస్‌ అధికారి అరవింద్‌ కుమార్‌పై కేసు నమోదు చేశారు ఏసీబీ అధికారులు.. ఈ కేసులో A-1గా కేటీఆర్, A-2గా ఐఏఎస్‌ అధికారి అరవింద్‌ కుమార్‌, A-3గా హెచ్‌ఎండీఏ చీఫ్‌ ఇంజనీర్‌ బీఎల్ఎన్‌ రెడ్డిని చేర్చారు.. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని ఏసీబీ కేసు నమోదు చేసింది. కేటీఆర్‌పై 4 సెక్షన్ల కింద ఏసీబీ కేసు నమోదు చేసింది. 13 (1) A, 13 (2) పీసీ యాక్ట్‌, 409, 120B కింద కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్‌ ప్రభుత్వ హయాంతో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని అభియోగాలు మోపారు.

Read Also: Hyderabad: ఐకియా వాహనంలో గంజాయి సరఫరా.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు ఇస్తున్న డ్రైవర్లు

మరోవైపు.. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఫార్ములా-ఈ రేసు విషయంలో ఏసీబీ కేసును వ్యతిరేకిస్తూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే తనపై కేసు పెట్టారని కేటీఆర్ అన్నారు. ఈ క్రమంలో.. ఈరోజు హైకోర్టులో వాదనలు జరిగాయి. అనంతరం.. కేటీఆర్‌కు ఊరట లభించింది. ఈనెల 30 వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయొద్దని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కేటీఆర్ కేసులో విచారణ జరపాలని ఆదేశించింది. అలాగే.. విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.