NTV Telugu Site icon

ED Raids Raj Kundra: పోర్నోగ్రఫీ కేసులో రాజ్ కుంద్రా ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు

Ed

Ed

ED Raids Raj Kundra: పోర్నోగ్రఫీ నెట్‌వర్క్ కేసులో నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా సంబంధింత నివాసాలు, కార్యాలయాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు చేసింది. ఈడీ కేసు నమోదు చేసిన తర్వాత ఇప్పుడు నివాస స్థలాలు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఈ దాడులకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. జూన్ 2021లో ‘అశ్లీల’ చిత్రాలను తీశారనే ఆరోపణలపై కుంద్రాను అరెస్టు చేశారు. ఈ కేసులో కుంద్రా ప్రధాన కుట్రదారుడని ముంబై పోలీసు అధికారులు పేర్కొన్నారు. రెండు నెలల జైలు జీవితం గడిపిన తరువాత, అతను ప్రస్తుతం సెప్టెంబర్ 2021 నుండి బెయిల్‌పై ఉన్నాడు.

Also Read: Naga Chaitanya-Sobhita: చై, శోభితలకు మంగళస్నానాలు.. వీడియో వైరల్!

రాజ్ కుంద్రా, అతని కంపెనీ పోర్న్ చిత్రాల ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించడమే కాకుండా.. దేశంలోని చట్టాలను అధిగమించడానికి ఏర్పాట్లు చేసారు. ఈ ఏడాది ఫిబ్రవరి 4, 2021న ముంబై పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేశారు. ఈ రాకెట్‌పై ముంబైలోని మల్వానీ పోలీస్ స్టేషన్‌లో ఓ బాలిక ఫిర్యాదు చేసింది. సినిమాల్లో, ఓటీటీలో నటనకు సంబంధిత పని ఇప్పిస్తామంటూ కొందరు అమ్మాయిలను అసభ్యకర చిత్రాల్లో నటించమని ఎలా బలవంతం చేస్తున్నారో ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పాటు ముంబైలోని పలువురు వ్యాపారవేత్తలు అసభ్యకర చిత్రాలను తెరకెక్కిస్తూ భారీగా డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో మలాడ్ వెస్ట్ ప్రాంతంలోని అద్దెకు పోర్న్ ఫిల్మ్ షూటింగ్ జరుగుతున్న బంగ్లాపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో ఒక బాలీవుడ్ నటితో సహా 11 మందిని కూడా అరెస్టు చేశారు.

Also Read: IFFI 2024 Winners: అట్టహాసంగా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలు.. విజేతలు వీరే

Show comments