NTV Telugu Site icon

ED Raids: ఛత్తీస్‌గఢ్లో ఈడీ దాడులు.. కాంగ్రెస్ నేత, ఐఏఎస్ అధికారుల నివాసాలపై రైడ్స్

Ed

Ed

మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా శుక్రవారం ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కొందరు ఐఏఎస్ అధికారులు, కాంగ్రెస్ నేతపై దాడులు చేసింది. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) అధికారి రాను సాహు, మరికొందరు బ్యూరోక్రాట్‌లు, ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ నాయకుడు, పీసీసీ కోశాధికారి రాంగోపాల్ అగర్వాల్‌కు సంబంధించిన ఇళ్లలో దాడులు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఈడీ అధికారులు పలువురు రాజకీయ నేతల ఇళ్లపై దాడులు చేస్తుంది. రాయ్‌పూర్‌లోని ఐఏఎస్ అధికారులు సాహు, అగర్వాల్ మరియు కోర్బాలోని కోర్బా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రభాకర్ పాండే నివాసాల్లో కేంద్ర పారామిలటరీ సిబ్బంది దాడులు నిర్వహిస్తుంది.

Unstoppable in OTT : ఓటీటీలోకి వచ్చేసిన ‘’వీజే సన్నీ’’ అన్ స్టాపబుల్

అయితే.. ఈడీ అధికారులు ఏ కేసులో దాడులు నిర్వహిస్తున్నారనే దానిపై ఇంకా అధికారిక సమాచారం రాలేదు. అయితే బియ్యం కుంభకోణానికి సంబంధించినదని కొన్ని వర్గాలు తెలుపుతున్నాయి. బొగ్గు గనులు మరియు మద్యం కుంభకోణంపై విచారణ జరుపుతున్నట్లు ఈడీ చెబుతుండగా.. ఐఏఎస్ అధికారులతో సహా కొంతమంది ప్రముఖ బ్యూరోక్రాట్‌లతో పాటు రాజకీయ నాయకులు మరియు వారి సహచరులను అరెస్టు చేసింది. మరోవైపు ఛత్తీస్‌గఢ్‌లో రూ. 2,000 కోట్ల మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో దర్యాప్తు చేయాలని జూలై 18న సుప్రీం కోర్టు ఈడీని కోరింది.