అమెరికా బిలియనీర్ జార్జ్ సోరోస్ మద్దతు ఉన్న ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్ (OSF) సంస్థతో పాటు బెంగళూరులోని కొన్ని అనుబంధ సంస్థలలో మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించింది. విదేశీ మారక ద్రవ్య ఉల్లంఘనలపై దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు నిర్వహించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ సోదాలు విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (FEMA) కింద జరుగుతున్నాయని, ఓఎస్‌ఎఫ్ తో పాటు కొన్ని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు కూడా ఇందులో పాల్గొన్నాయని అధికారులు తెలిపారు. ఓఎస్‌ఎఫ్ ద్వారా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) సేకరించారని, ఎఫ్‌ఈఎమ్‌ఏ మార్గదర్శకాలను ఉల్లంఘించే విధంగా కొంతమంది లబ్ధిదారులు ఈ నిధులను వినియోగించుకున్నారని ఆరోపణలు వచ్చాయి.
READ MORE: Sunita Williams: సునీతా విలియమ్స్ ల్యాండింగ్ అయ్యే చివరి 45 నిమిషాలు ప్రమాదకరం..!
ఇదిలా ఉండగా.. జార్జ్ సోరోస్.. హంగేరియన్-అమెరికన్ వ్యాపారవేత్త. ప్రపంచ అపర కుబేరుల్లో ఒకరు. ఈయన సంపద విలువ 8.6 బిలియన్ డాలర్లు. ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్ పేరుతో 32 బిలియన్ డాలర్లను దానం చేస్తున్నట్లు ప్రకటించి.. 15 బిలియన్‌డాలర్లు ఇప్పటికే ఇచ్చేశాడు కూడా. ప్రపంచంలోకెల్లా ‘అత్యంత ఉదార దాత’ అనే బిరుదును ఈయనకు కట్టబెట్టింది ఫోర్బ్స్. అయితే.. గతంలో జార్జ్ సోరోస్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అదానీ గ్రూప్ సంక్షోభాన్ని లేవనెత్తిన ఆయన.. విదేశీ పెట్టుబడిదారులు, భారత పార్లమెంట్‌లో విపక్షాలు లేవనెత్తుతున్న ప్రశ్నలకు ప్రధాని మోడీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
READ MORE: Sunita Williams: సునీతా విలియమ్స్ ల్యాండింగ్ అయ్యే చివరి 45 నిమిషాలు ప్రమాదకరం..!
‘మోడీ, అదానీకి దగ్గరి సంబంధాలున్నాయి. హిండెన్‌బర్గ్ నివేదికతో అదానీ గ్రూప్ కష్టాల్లో పడింది. మోడీ బలహీన పడే అవకాశముంది. ‘‘ఈ పరిణామం కచ్చితంగా భారత సమాఖ్య ప్రభుత్వంపై ఆ దేశ ప్రధాని మోడీకి ఉన్న పట్టును గణనీయంగా బలహీనపరుస్తుంది. సంస్థాగత సంస్కరణల కోసం తలుపులు తెరవాల్సి వస్తుంది. నాకు అక్కడి(భారత్) విషయాలపై పెద్దగా అవగాహన లేకపోయి ఉండొచ్చు. కానీ, భారతదేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణను నేను ఆశిస్తున్నాను” అని మిస్టర్ సోరోస్ పేర్కొన్నారు. ఈ బిలియనీర్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. కేంద్ర మంత్రులు సోరోస్ వ్యాఖ్యలను ‘భారత్‌పై సహించరాని దాడి’గా అభివర్ణించారు.