ED Raids: హైదరాబాద్‌లో రెండవ రోజూ ఈడీ సోదాలు.. కోట్లలో నగదు పట్టివేత!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ED Raids: హైదరాబాద్ నగరంలో రెండవ రోజూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సోదాలు కొనసాగుతున్నాయి. దేశంలో ఆర్థిక నేరాలను అరికట్టే ఉద్దేశంతో ఈడీ చేపట్టిన ఈ దాడుల్లో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా సురానా ఇండస్ట్రీస్ ఎండీ నరేంద్ర సురానా నివాసంలో పెద్దఎత్తున నగదు స్వాధీనం కావడం కలకలం రేపుతోంది. ఈడీ ప్రాథమిక విచారణలో నరేంద్ర సురానా పలు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి, బ్యాంకుల నుంచి పొందిన రుణాలను వీటి ద్వారా అక్రమ లావాదేవీలకు ఉపయోగించినట్లు గుర్తించారు. ఈ షెల్ కంపెనీలకు నిధులు బదలాయింపుతో పాటు, భారీ మొత్తంలో రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్టు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంపై ఈడీ మరింత లోతుగా విచారణ జరుపుతోంది.
ఈ సోదాల్లో మరో కీలక సంఘటన సాయి సూర్య డెవలపర్స్‌కు చెందిన సతీష్ ఇంట్లో భారీగా నగదు స్వాధీనం కావడం. అలాగే సాయి సూర్య సంస్థల కార్యాలయాల్లోనూ కోట్లల్లో నగదు పట్టుబడింది. గతంలోనే సైబరాబాద్ పోలీసులు సతీష్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వట్టి నాగులపల్లి ప్రాంతంలో “వెంచర్” పేరుతో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును దృష్టిలో ఉంచుకుని ఈడీ అధికారులు సాయి సూర్య డెవలపర్స్‌పై విచారణ చేపట్టారు. ఇప్పటికే సంస్థకు చెందిన పలు బ్యాంకు లావాదేవీలు, ప్రాపర్టీల వివరాలను సేకరిస్తున్నారు. మొత్తం మీద ఈడీ దాడులతో నగర వ్యాప్తంగా ఆర్థిక నేరాలపై ఉక్కుపాదం వేసే దిశగా చర్యలు సాగుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈడీ సోదాల్లో నగదు, షెల్ కంపెనీల వ్యవహారాలు వెలుగులోకి రావడం ఇప్పటికే ఉన్న పోలీసు కేసులతో ముడిపడడం వల్ల ఈ దర్యాప్తు మరింత ఉత్కంఠకు గురిచేస్తోంది. ముందు ముందు రోజుల్లో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.
Also Read
- Tilak Varma: "నమ్మకమే నా బలం.." అలా ఆడడం అంటే ఎంతో ఇష్టం..!
- Mumbai Indians Win: తిలక్ వర్మ తుఫాన్ ఇన్నింగ్స్ దెబ్బ.. పంజాబ్ అబ్బా..
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్‌దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్‌కు నిలిచిపోనున్న రష్యా చమురు..
తాజావార్తలు
-
Peddi: ‘పెద్ది’ రిలీజ్‌కు భారీ షాక్..
-
Delhi Work From Home: ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్.. పొదుపు చర్యల జాబితా విడుదల
-
Jasprit Bumrah: “ఇక మిగిలింది వన్డే కెప్టెన్సీనే.. కానీ!”.. కెప్టెన్‌గా తొలి విజయంపై జస్ప్రీత్ బుమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Dragon: నేషనల్ మీడియా సమక్షంలో ‘డ్రాగన్’ ఫస్ట్ గ్లింప్స్ లాంచ్!
-
Tilak Varma: “నమ్మకమే నా బలం..” అలా ఆడడం అంటే ఎంతో ఇష్టం..!
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!