ఎంబీఎస్ జ్యువెల్లర్స్ కేసులో ఆస్తులను తాత్కాలిక జప్తు చేసింది ఈడీ. ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎంటీసీని మోసం చేసిన కేసులో ఆస్తులు అటాచ్ చేసారు. రూ.363కోట్ల విలువైన 44 స్థిరాస్తులను అటాచ్ చేసింది ఈడీ. ఎంబీఎస్ జ్యువెల్లర్స్, ఎంబీఎస్ ఇంపెక్స్ ప్రై.లి. ఆస్తులు జప్తు చేసారు. సుఖేష్ గుప్తా, అనురాగ్ గుప్తా, నీతూ గుప్తా, వందన గుప్తా ఆస్తులు కూడా అటాచ్ చేసారు. బంగారం కొనుగోళ్ల పేరిట ఎంఎంటీసీకి రూ.504 కోట్ల నష్టం చేసినట్లు అభియోగం మోపారు. ఫెమా నిబంధనలు ఉల్లంఘించినందుకు మరో రూ.222 కోట్ల జరిమానా విధించారు. ఈ విచారణలో నిందితులు సహకరించడం లేదని ఈడీ వెల్లడించింది.