NTV Telugu Site icon

Election Commission: ఓటింగ్ శాతాన్ని పెంచడమే లక్ష్యంగా ఈసీ ముందడుగు..

Ec

Ec

రాబోయే ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంపొందించేందుకు, ప్రజాస్వామ్యాన్ని అర్థవంతంగా మార్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ కోరారు. యువకులు, పట్టణ ఓటర్లు ఎన్నికల ప్రక్రియ పట్ల ఉదాసీనత వంటి వివిధ కారణాల వల్ల వరుసగా జరిగిన ఎన్నికల్లో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదైందని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఓటింగ్ శాతం మరింత తగ్గకుండా సీఈవోలు కృషి చేయాలని ఆయన కోరారు. ఢిల్లీలోని ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యాలయం నిర్వచన్ సదన్‌ నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో వివిధ రాష్ట్రాల సీఈఓలను ఉద్దేశించి మాట్లాడుతూ తక్కువ శాతాలు నమోదు కావడానికి ఏదైనా నిర్దిష్ట సమస్య ఎదురైతే కమిషన్ దృష్టికి తీసుకురావాలని సూచించారు. చివరి నిమిషంలో పరిష్కారాలకు బదులుగా ఓటర్లలోని గందరగోళాన్ని తొలగించేందుకు వ్యవస్థాగత మరియు దీర్ఘకాలిక కార్యక్రమాలను చేపట్టాలన్నారు.

Hyderabad: రాజేంద్రనగర్లో డ్రగ్స్ కలకలం..

మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకు చెందిన సీఈఓలు తమ తమ రాష్ట్రాలలో ఓటింగ్ శాతాన్ని మెరుగుపరచడానికి వారు చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా.. బస్టాండ్‌లు, రవాణా వాహనాలు వంటి బహిరంగ ప్రదేశాల్లో కమిషన్ యొక్క కీలక సందేశాలను ప్రదర్శించడం, వాలంటీర్లు మరియు ప్రభుత్వేతర సంస్థల సేవలను వినియోగించుకోవడం, ఓటర్లు ఓటు వేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పడం వంటి అంశాలపై దృష్టి సారించినట్లు వారు తెలిపారు. ఇంకా.. పార్కులు, మార్కెట్లు, మాల్స్ మరియు బహిరంగ ప్రదేశాలలో నిర్వహించే ప్రదర్శనల వద్ద అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మరుగుదొడ్లు, తాగునీరు, పోలింగ్‌ కేంద్రాల్లో వికలాంగులతో సహా వీల్‌ చైర్‌లో వెళ్లే ఓటర్లకు ర్యాంపులు వంటి సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు వారు తెలిపారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద క్యూలైన్ల భయంతో కొందరు ఓటర్లు బయటకు రావడం లేదని సమావేశం దృష్టికి తీసుకెళ్లారు. బూత్‌ల వద్ద క్యూలను వేగంగా కదిలేలా కొత్త పద్ధతులు, చర్యలు తీసుకుంటామన్నారు.

Harish Rao: రాహుల్ గాంధీకి హరీష్ రావు లేఖ..

ఈ సమావేశానికి హాజరైన జిల్లా ఎన్నికల అధికారి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డి. రోనాల్డ్ రోస్ హైదరాబాద్ నగరం గురించి ప్రజెంటేషన్ చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికలలో 45.65 తక్కువ పోలింగ్ శాతం నమోదైందన్నారు. యువకుల ఉదాసీనత, రోజువారీ వేతనాలు పొందే వారు పోలింగ్ రోజున సెలవు ప్రకటించినప్పటికీ పనికి వెళ్లడం, ఒకే కుటుంబంలోని ఓటర్లను వేర్వేరు బూత్‌లకు కేటాయించడం, అంతర్గత వలసలు మరియు క్యూలో వేచి ఉండటమే తక్కువ ఓటింగ్‌కు కారణమని చెప్పారు. ఓటరు భాగస్వామ్యాన్ని పెంచడం కోసం కమీషన్ సందేశాలను హైలైట్ చేసే పాటలను వినిపించేందుకు దాదాపు 4,500 స్వచ్చ ఆటోలు ఉపయోగిస్తున్నామన్నారు. మొబైల్ ఫోన్ల ద్వారా ఓటర్లను బూత్‌కు ఆహ్వానించేందుకు యువతను నియమించనున్నారు. ఈ సమావేశానికి ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్, పూణే లక్నో, నాగ్‌పూర్ మరియు థానే వంటి ప్రధాన నగరాలకు సంబంధించిన సీఈవోలు మరియు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్లు హాజరయ్యారు.