NTV Telugu Site icon

Election Commission: డీఐజీ అమ్మిరెడ్డిపై బదిలీ వేటు.. అనంతపురం, రాయచోటికి కొత్త డీఎస్పీలు..

Ap Elections Ec Review

Ap Elections Ec Review

Election Commission: ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల వేళ.. కీలక మార్పులు జరుగుతున్నాయి.. ఏపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌ సహా పలువురు కీలక అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) బదిలీ వేటు వేసిన విషయం విదితమే కాగా.. తాజాగా, అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై కూడా ఎన్నికల కమిషన్‌ బదిలీ వేటు వేసింది.. తక్షణమే విధుల నుంచి రిలీవ్‌ కావాలని ఆదేశాలు జారీ ఈసీ.. అంతేకాదు.. ఆయనకు ఎన్నికల విధులను అప్పగించొద్దని స్పష్టం చేసింది.. అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి అమ్మిరెడ్డి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ.. విపక్షాలు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో.. చర్యలకు పూనుకుంది ఈసీ..

Read Also: Aa Okkati Adakku : మూడో రోజు మరింత ఎక్కువగా.. ఫన్ బ్లాక్ బస్టర్ గా అల్లరోడి సినిమా..

మరోవైపు.. ఈ మధ్యే అనంతంపురం జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ను ఈసీ బదిలీ చేసిన విషయం విదితమే కాగా.. ఆయన స్థానంలో అమిత్‌ బర్దర్‌ను నియమించింది. ఇక, అనంతపురం అర్బన్ డీఎస్పీగా టీవీవీ ప్రతాపి కుమార్‌ను.. రాయచోటి డీఎస్పీగా రామచంద్రరావును నియమించింది ఎన్నికల కమిషన్‌.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.. అంతే కాదు.. ఇవాళ రాత్రి 8 గంటల్లోగా బాధ్యతలు తీసుకోవాలని టీవీవీ ప్రతాపి కుమార్‌, రామచంద్రరావును ఆదేశించింది ఈసీ.

Show comments