పెరుగు రోజు తినడం ద్వారా మన శరీరానికి మేలు చేసే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందులో మంచి పోషకాలు ఉంటాయి కనుక.. ఎప్పుడైనా తినొచ్చు. పెరుగును చలికాలంలో, వర్షాకాలంలో మధ్యాహ్నం పూట తింటే.. జలుబు చేసే అవకాశం ఉండదు. ఇక ఎండకాలమైతే.. పెరుగుతో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అయితే క్రమం తప్పకుండా రోజు పెరుగు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పెరుగు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.
Sathyaraj: బ్రేకింగ్.. బాహుబలి కట్టప్ప ఇంట తీవ్ర విషాదం
జీర్ణం
పెరుగు ఒక గొప్ప ప్రోబయోటిక్. ఇందులో మంచి బ్యాక్టీరియా పుష్కలంగా ఉంటుంది. రోజూ పెరుగును తీసుకోవడం వల్ల మీ జీర్ణక్రియ మెరుగ్గా పనిచేస్తుంది. కడుపు అసౌకర్యాన్ని తగ్గించడానికి, కడుపు, పేగుల ఆరోగ్యాన్ని కాపాడటానికి కూడా పెరుగు సహాయపడుతుంది. అలాగే పెరుగు తింటే మలబద్దకం సమస్య తగ్గిపోతుంది.
ఎముకల ఆరోగ్యం
పెరుగులో ఎక్కువగా కాల్షియం ఉంటుంది. అందుకోసం క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. పెరుగు బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. పెరుగులో విటమిన్ డి, ప్రోటీన్స్ ఉంటాయి. ఇది కండరాలు, ఎముకలు, దంతాల ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది.
Himachal Pradesh: విరిగిపడిన కొండచరియలు.. ఆరుగురు పోలీసులు సహా 7 మంది మృతి
గుండె ఆరోగ్యం
పెరుగులో పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి అధిక రక్తపోటును నియంత్రించడానికి, గుండె ఆరోగ్యాన్ని రక్షించడానికి సహాయపడతాయి. పెరుగు తినడం వల్ల గుండెపోటు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
బరువు తగ్గాలంటే
కేలరీలు తక్కువగా, ప్రోటీన్ ఎక్కువగా ఉండే పెరుగును క్రమం తప్పకుండా తీసుకోవడం ఆకలిని బాగా తగ్గుతుంది. ఇది మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. పెరుగు కూడా మీ కడుపును తొందరగా నింపుతుంది.
చర్మ ఆరోగ్యం
పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పెరుగు తినడానికి మాత్రమే కాదు.. ముఖానికి అప్లై చేయడానికి కూడా మంచిది. పెరుగులోని లాక్టిక్ యాసిడ్ డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. డార్క్ స్పాట్స్ ను పోగొడుతుంది.
