Best foods to build muscle: కండరాలు బలంగా మారాలంటే ఈ ఫుడ్స్ తినండి..
- దృఢమైన శరీరం.. బలమైన కండరాలు పొందడం చాలా మంది కోరిక
- దాని కోసం జిమ్‌లో రకరకాల వ్యాయామాలు
- స్టెరాయిడ్స్ తో చాలా ప్రమాదం
- ఈ అయిదు రకాల ఆహార పదార్థాలతో మంచి ఫలితాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శరీరం దృఢంగా, బలమైన కండరాలు కలిగి ఉండాలని చాలా మంది ఆశపడుతుంటారు. ఇందుకోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. దానికి తగినట్టుగా జిమ్‌కెళ్లి రకరకాల వ్యాయామాలు చేసి కష్టపడుతుంటారు. అయినప్పటికీ, సహజంగా కండరాల బరువు పెరగడం అంత తేలికైన పని కాదు. మరికొందరు త్వరగా కండలు రావడానికి ప్రొటీన్ సప్లిమెంట్లతోపాటు స్టెరాయిడ్స్ కూడా వాడతారు. దీంతో అనారోగ్యం బారిన పడుతుంటారు. అయితే మేము చెప్పే ఈ అయిదు రకాల ఆహార పదార్థాలతో కండరాలను మెరుగు పరుచుకోండి. ఒక పరిశోధన ప్రకారం.. మీరు కండరాలను బలంగా, ఫ్లెక్సిబుల్‌గా మార్చాలనుకుంటే కిలోగ్రాము బరువుకు 1.4 నుండి 2 గ్రాముల ప్రోటీన్ తినవలసి ఉంటుంది. దీంతో పాటు కసరత్తులు చేయాల్సి ఉంటుంది. మీరు మీ కండరాలకు జీవం పోయగలిగే ప్రోటీన్‌తో కూడిన అటువంటి 5 ఆహారాల గురించి ఇక్కడ చూద్దాం.
Also Read
- Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
- Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
- Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
- Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
86 గ్రాముల సోయాబీన్స్‌లో 16 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. మీరు శాఖాహారులైతే సోయాబీన్స్ మీకు ముఖ్యమైనది. సోయాబీన్స్ అంటే మీరు పప్పుదినుసుల ఆకుపచ్చ కూరగాయలలో ఏదైనా తీసుకోవచ్చు. ఈ పదార్థాలు ప్రోటీన్‌తో నిండి ఉంటాయి. మీరు నాన్ వెజ్ తినేవాళ్లయితే కండరాలను పెంచుకోవడానికి ఇంతకంటే మంచి మార్గం మరొకటి ఉండదు. రోజూ చికెన్ బ్రెస్ట్ ను కొన్ని రోజులు తినండి. కేవలం 85 గ్రాముల చికెన్ నుండి 26.7 గ్రాముల ప్రోటీన్ పొందుతారు. అందులోనూ హైక్వాలిటీ ప్రొటీన్ లభ్యమవుతుంది. చికెన్‌లో విటమిన్ బి,బి6 ఉన్నాయి, ఇవి కండరాలలో బలాన్ని పొందేందుకు చాలా ముఖ్యమైనవి. ప్రతి ప్లేస్ లో సాల్మన్ చేపలు దొరకడం కష్టం అయినప్పటికీ, సాల్మన్ చేప కండరాల కోసం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. 85 గ్రాముల సాల్మన్ చేపలలో 17 గ్రాముల ప్రొటీన్ లభిస్తుంది. దీంతో పాటు ఇందులో 1.5 గ్రాముల ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, అనేక రకాల విటమిన్లు ఉంటాయి. ఇవన్నీ మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
READ MORE: KCR: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
ప్రోటీన్ పౌడర్ కండరాల బలాన్ని పెంచడానికి కూడా ఒక అద్భుతమైన మూలం. ప్రొటీన్ పౌడర్ చేయడానికి డ్రై ఫ్రూట్స్ తీసుకుని ఓట్స్, ముతక గింజలు మొదలైన వాటి పౌడర్ తయారు చేసి, అన్నీ కలిపి పౌడర్ సిద్ధం చేసుకోవాలి. దానిని తినండి. కొన్ని నెలల్లో అద్భుతమైన రిజల్ట్ కనబడుతుంది. ప్రతిరోజూ గుడ్లు తీసుకోవాలి. గుడ్డులో అధిక నాణ్యత గల ప్రోటీన్ ఉంటుంది, ఇది కండరాల నిర్మాణానికి, దాని పునరుద్ధరణకు చాలా ముఖ్యమైనది. అయితే రోజూ 2 నుండి 3 గుడ్లు మాత్రమే తినండి, అది కూడా కొంత సమయం వరకు. సాధారణంగా ఒకటి నుండి రెండు గుడ్లు తినడం మంచిది.
తాజావార్తలు
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!