NTV Telugu Site icon

Health Tips: కీళ్లనొప్పులతో బాధపడుతున్నారా.. ఈ ఆహారంతో ఉపశమనం..!

Noppi

Noppi

ఈ రోజుల్లో చాలా మంది మెకాళ్లు, మోచేతి, వెన్నెముక, కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. చాలా మందిలో యూరిక్‌ యాసిడ్‌ పెరగడం మూలంగా కీళ్ల నొప్పులు, వాపుల సమస్యలను ఎదుర్కొంటున్నారు. దానికి తోడు వ్యాయామాలు చేయడంతో ఆ నొప్పులు ఇంకా వీపరీతమవుతున్నాయి. అయితే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందాలంటే.. ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వారు ఎలాంటి ఆహారం తీసుకుంటే కీళ్ల నొప్పుల సమస్య తొలగిపోతాయో తెలుసుకుందాం.

కీళ్ల నొప్పుల సమస్య ఉన్నవారు ప్రతి రోజు ఆహారంలో బాదం, వేరుశెనగ, వాల్‌నట్స్‌ తీసుకోవాలి. ఇందులో పుష్కలంగా లభించే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాల వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. వీటిల్లో ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, విటమిన్‌ ‘u’ కూడా ఎక్కువగా లభిస్తుంది. వీటిని ఎక్కువగా ఆహారంలో చేర్చుకుంటే కీళ్లనొప్పుల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది.

Yamudu: భూమిపైకి ‘యముడు’.. నరకంలో శిక్షలు ఇక్కడే అమలు పరిస్తే?

బెర్రీలు
బెర్రీలు బ్లబెర్రీస్, బ్లాక్‌బెర్రీస్, స్ట్రాబెర్రీల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వీటిని ప్రతిరోజు తింటే కీళ్ల నొప్పుల నుంచి రిలీఫ్ ను పొందవచ్చు. అంతేకాకుండా తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుందని డాక్టర్లు చెబుతున్నారు. వీటి వల్ల శరీరానికి ఫ్రీ రాడికల్స్‌ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.

కాలీఫ్లవర్
కూరగాయల్లో సల్ఫోరాఫేన్‌ కలిగిన ఆహారాలు తీసుకుంటే సులభంగా యూరిక్‌ యాసిడ్‌ సమస్యల నుంచి రిలీఫ్ ను పొందవచ్చు. కాబట్టి బ్రోకలీ, కాలీఫ్లవర్‌లను ఆహారంలో తీసుకోవాలి.

Belly Fat:ఈ డ్రింక్ ను తాగితే 7 రోజుల్లోనే కొవ్వు మైనంలా కరిగిపోతుంది..

ఆలివ్‌ ఆయిల్‌
కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు ఆలివ్‌ ఆయిల్‌తో తయారు చేసిన ఆహారాలను తీసుకుంటే మంచిది. దాంతో శరీరం దృఢంగా మారడంతో పాటు కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

డార్క్ చాక్లెట్
ప్రతి రోజు డార్క్‌ చాక్లెట్‌ తీసుకోవడం వల్ల శరీరానికి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు లభిస్తాయి. ముఖ్యంగా కీళ్ల నొప్పులతో బాధపడేవారు రోజూ వీటిని తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. మధుమేహం ఉన్నవారు కూడా డార్క్ చాక్లెట్ తినడం వల్ల చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.