East Godavari Horror: తూర్పుగోదావరి జిల్లాలో విషాదం.. భార్యను దారుణంగా హత్య చేసిన భర్త!
- తూర్పుగోదావరి జిల్లాలో దారుణ ఘటన
- భార్యను దారుణంగా హత్య చేసిన భర్త
- దంపతులు ఒడిశా రాష్ట్రానికి చెందిన వారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తూర్పుగోదావరి జిల్లాలోని కాపవరం గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గ్రామ పరిధిలో ఉన్న ఒక పౌల్ట్రీ ఫారంలో పనిచేస్తున్న మహిళ ఉషను ఆమె భర్త సురేంద్ర హత్య చేసినట్లు సమాచారం. ప్రాథమిక వివరాల ప్రకారం.. మృత దంపతులు ఒడిశా రాష్ట్రానికి చెందిన వారని పోలీసులు గుర్తించారు. ఉపాధి కోసం వారు కొంతకాలంగా కాపవరం గ్రామంలోని పౌల్ట్రీ ఫారంలో పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నారు.
ఈరోజు తెల్లవారుజామున దంపతుల మధ్య ఏదో విషయంపై వివాదం జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే హత్యకు దారితీసిన అసలు కారణాలు ఇంకా వెల్లడికాలేదు. ఘటన అనంతరం విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడు సురేంద్రను అదుపులోకి తీసుకున్నారా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
Also Read
- Pakistan: మధ్యవర్తిత్వం చేశాం కదా $10 బిలియన్లు ఇవ్వండి.. అమెరికాను కోరిన పాకిస్తాన్..
- Rahul Gandhi: 152 సార్లు నీట్ పేపర్ లీకైతే ఒక్కరికీ శిక్ష పడలేదు.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- Hormuz-US: హార్ముజ్‌పై అమెరికా వ్యూహం ఇదేనా? టార్గెట్ ఏంటంటే..!
- CJP: కాక్రోచ్ ఉద్యమం ఎటు పోతోంది.? పేపర్ లీక్‌పై నిరసన అయితే దాడులు, విద్వేష నినాదాలు ఎందుకు.?
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ కలహాలు, వ్యక్తిగత విభేదాలు లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. ఈ దారుణ ఘటనతో కాపవరం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. హత్య వెనుక ఉన్న పూర్తి కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.
తాజావార్తలు
-
Pakistan: మధ్యవర్తిత్వం చేశాం కదా $10 బిలియన్లు ఇవ్వండి.. అమెరికాను కోరిన పాకిస్తాన్..
-
Balakrishna : బాలయ్యకి సర్జరీ.. NBK 111 పరిస్థితి ఏంటి?
-
Rahul Gandhi: 152 సార్లు నీట్ పేపర్ లీకైతే ఒక్కరికీ శిక్ష పడలేదు.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
Gabbar Singh Ramesh: గబ్బర్ సింగ్’ నటుడికి బ్రెయిన్ స్ట్రోక్!
-
MS Dhoni: ఎంఎస్ ధోనీ కొత్త బిజినెస్‌కు బంపర్ బూస్ట్.. కోట్లలో నిధులు సమీకరణ!
ట్రెండింగ్
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!