Earthquake: ఢిల్లీలో భూకంపం.. ప్రాణ భయంతో వీధుల్లోకి పరుగులు పెట్టిన జనాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం ఒక్కసారిగా భూమి కంపించింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలోని నోయిడా, గురుగ్రామ్‌లతో పాటు పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, కార్గిల్ ప్రాంతాల్లో బలమైన భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఒక్కసారిగా ఇళ్లు, కార్యాలయాలు ఊగిపోవడంతో జనం ప్రాణభయంతో వీధుల్లోకి పరుగులు తీశారు.
నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) నివేదిక ప్రకారం.. ఈ భూకంపం ఆఫ్ఘనిస్తాన్‌లోని దరావన్ సమీపంలో సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.9గా నమోదైంది. భూ అంతర్భాగంలో సుమారు 5 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు కేంద్రీకృతమయ్యాయి. లూధియానా, చండీగఢ్, శ్రీనగర్, పూంచ్ వంటి నగరాల్లో కూడా ప్రజలు కొన్ని సెకన్ల పాటు ప్రకంపనలను స్పష్టంగా అనుభవించారు. ఇంట్లోని వస్తువులు కింద పడిపోయాయని, భవనాలు ఊగడాన్ని గమనించామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read
ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భూమి కంపించడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. ఇంతకుముందు జనవరి నెలలో కూడా ఒక సోమవారం ఉదయం 2.8 తీవ్రతతో స్వల్ప భూకంపం సంభవించింది. అప్పట్లో ఉత్తర ఢిల్లీ కేంద్రంగా ఈ ప్రకంపనలు వచ్చాయి. తాజా ఘటనలో ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా ఉన్నప్పటికీ, దాని ప్రభావం ఉత్తర భారతంపై తీవ్రంగా పడింది.
ప్రస్తుతానికి అందిన సమాచారం ప్రకారం, ఈ భూకంపం వల్ల ఎక్కడా ప్రాణ నష్టం గానీ, ఆస్తి నష్టం గానీ సంభవించలేదు. ప్రకంపనలు ఆగిపోయిన తర్వాత కూడా ప్రజలు చాలా సేపటి వరకు తమ నివాసాల్లోకి వెళ్లడానికి భయపడ్డారు. అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!