Pakistan Earthquake 2025: పాకిస్థాన్‌లో సోమవారం భూకంపం సంభవించింది. ఈ బలమైన భూకంపం రిక్టర్ స్కేలుపై 4.7 తీవ్రతతో నమోదు అయ్యింది. ఈ భూకంపం కారణంగా అనేక ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొనడంతో పాటు, పలు చోట్ల ఇళ్లు దెబ్బతిన్నాయి. అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని పాక్ అధికారులు పేర్కొన్నారు. స్థానిక యంత్రాంగం పరిస్థితిని పర్యవేక్షిస్తోంది.
READ ALSO: IND vs SA: భారత్, దక్షిణాఫ్రికా మ్యాచ్.. 60 రూపాయలకే టికెట్!
నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) నివేదికల ప్రకారం.. భూకంపం 4.7 తీవ్రతతో, 10 కిలోమీటర్ల లోతులో సంభవించిందని పేర్కొంది. భారత ప్రామాణిక కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 11:12 గంటలకు పాకిస్థాన్‌లో ఈ భూకంపం సంభవించింది. గత శనివారం, ఆదివారం కూడా దాయాది దేశంలో 4.0 తీవ్రతతో కూడిన భూకంపాలు సంభవించాయి. భూకంపం జరిగిన ప్రదేశాన్ని NCS తన అధికారిక X(ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసింది. ఉపరితల భూకంపాలు ప్రమాదకరమైనవిగా నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వీటి భూకంప తరంగాలు ఉపరితలానికి తక్కువ దూరం ప్రయాణిస్తాయని, ఫలితంగా బలమైన ప్రకంపన, ఎక్కువ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అంటున్నారు.
పాకిస్థాన్ భూకంపపరంగా చురుకైన ప్రాంతంలో ఉంది. దేశంలో బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా, గిల్గిట్-బాల్టిస్తాన్ వంటి ప్రాంతాలు యురేషియన్ బెల్ట్ దక్షిణ అంచున ఉన్నాయని నిపుణులు పేర్కొన్నారు. సింధ్, పంజాబ్ భారత బెల్ట్ వాయువ్య అంచున ఉన్నాయి. ఈ టెక్టోనిక్ ఘర్షణల కారణంగా, పాకిస్థాన్‌లోని వివిధ ప్రాంతాలు తరచుగా భూకంపాలు సంభవిస్తున్నాయని అంటున్నారు. 1945లో బలూచిస్థాన్‌లో 8.1 తీవ్రతతో సంభవించిన భూకంపంతో సహా దేశం భూకంప తీవ్రతకు చారిత్రక సాక్ష్యంగా నిలిచింది. సింధ్ ప్రాంతంలో భూకంపాలు తరచుగా తక్కువ తీవ్రతతో సంభవిస్తున్నాయని, అయితే వీటిని సురక్షితంగా పరిగణించకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం భద్రతా చర్యలు తీసుకోవాలని, అత్యవసర సన్నాహాలు పూర్తి చేయాలని చెబుతున్నారు.
భూకంప శాస్త్రవేత్తలు మాట్లాడుతూ.. ఈ ప్రాంతాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. పాకిస్థాన్ భౌగోళిక స్థానం కారణంగా, భవిష్యత్తులో ఇలాంటి భూకంప సంఘటనలు పదే పదే సంభవించవచ్చని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పాక్ పౌరులందరూ అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం అని వాళ్లు పేర్కొన్నారు.
READ ALSO: Diwali Fireworks Sales: రూ.7 వేల కోట్లు దాటిన బాణసంచా అమ్మకాలు.. ఎక్కడో తెలుసా?
EQ of M: 3.4, On: 20/10/2025 17:43:58 IST, Lat: 26.11 N, Long: 89.72 E, Depth: 10 Km, Location: Bangladesh.
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/el5IqVpjwd— National Center for Seismology (@NCS_Earthquake) October 20, 2025