Eagle : విందు భోజనం లా ఉండబోతున్న ఈగల్ మూవీ సాంగ్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం వరుస సినిమాల తో ఎంతో బిజీ గా ఉన్నాడు మాస్ మహారాజ్ రవితేజ.ఆయన నటిస్తోన్న తాజా చిత్రాల్లోఈగల్ సినిమా కూడా ఒకటి.ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ అయిన కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఈగల్ మూవీ లో రవితేజ సరసన అనుపమపరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే కావ్య థాపర్ మరో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల వంటి ఇతర నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా పాటలపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ధమాకా సినిమా లాంటి మాస్ సాంగ్స్ ఈ సినిమాలో ఉండేలా చూడండి సాంగ్స్ మంచి హిట్టవ్వాలి అంటూ ఓ నెటిజన్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ట్వీట్ చేశాడు.దీనిపై మేకర్స్ స్పందిస్తూ.. ఈగల్ పాటలపై ఎలాంటి సందేహం వద్దు. ఈ సినిమాలో పాటలు విందుభోజనంలా ఉండబోతున్నాయి రవితేజ ఫ్యాన్స్ కు చాలా స్పెషల్ సాంగ్స్ కాబోతున్నాయి అని రీ ట్వీట్ చేసింది. దీంతో రవితేజ ఈ సారి కూడా తన నుంచి అభిమానులు కోరుకుంటున్న ఎనర్జిటిక్ సాంగ్స్‌ను అందించబోతున్నాడని ట్వీట్ ద్వారా క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. ఈగల్ చిత్రీకరణ శర వేగంగా జరుగుతుంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే హైదరాబాద్‌లో ని అల్యూమినియం ఫ్యాక్టరీ లో జరిగింది.. రీసెంట్ గా కొత్త షెడ్యూల్ కోసం హీరో రవితేజ మరియు మూవీ టీం లండన్‌కు చేరుకున్నారు.రవితేజ రీసెంట్ గా లండన్ కి వెళ్తూ విమానంలోని బిజినెస్ క్లాస్ లో దిగిన ఫొటోను ఇన్ స్ట్రాగ్రామ్‌లో షేర్ చేసాడు. అలాగే ఈగల్ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ లండన్ లో జరుగనున్నట్టు క్లారిటీ ఇచ్చేశాడు. ఈ షెడ్యూల్ లో రెండు వారాల పాటు ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని సమాచారం.
Also Read
- Gadikota Srikanth Reddy: 'ఫాల్స్ ప్రచారం చేస్తున్నారు'.. సీఎంపై గడికోట శ్రీకాంత్ రెడ్డి ఫైర్
- AI కోర్సులకు భారీ డిమాండ్.. TGEAPCET-2026 రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తి..!
- Danish Kaneria: "రాముడు, మోడీ, హిందుత్వాన్ని తిట్టడమే నిరసనా?".. సీజేపీ ఆందోళనలపై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Sooryavanshi: టీ20ల్లో చరిత్ర సృష్టించే ఛాన్స్.. వైభవ్ సూర్యవంశీ ఆ రికార్డు బద్దలు కొడతాడా?
తాజావార్తలు
-
Romanchakam: ప్రేమలో మునిగిపోయే మెలోడీ.. ‘రొమాంచకం’ నుంచి ‘రాధా రమణ’ పాట రిలీజ్!
-
Gadikota Srikanth Reddy: ‘ఫాల్స్ ప్రచారం చేస్తున్నారు’.. సీఎంపై గడికోట శ్రీకాంత్ రెడ్డి ఫైర్
-
AI కోర్సులకు భారీ డిమాండ్.. TGEAPCET-2026 రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తి..!
-
Honor Pad X9 Max: హానర్ ప్యాడ్ X9 మ్యాక్స్ విడుదల.. 10,100 mAh బ్యాటరీ, 13- ఇంచెస్ 2.5K డిస్ప్లే
-
Vaibhav Sooryavanshi: ప్రపంచ రికార్డుపై వైభవ్ సూర్యవంశీ కన్ను.. ఇంకెవ్వరూ బ్రేక్ చేయలేరేమో!
ట్రెండింగ్
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్‌బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!