Duvvada Srinivas vs Duvvada Vani: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమయంలో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది.. అయితే, శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది.. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.. టెక్కలి నుంచి బరిలోకి దిగుతుండగా.. ఆయన భార్య వాణి సంచలన ప్రకటన చేయడం చర్చగా మారింది. టెక్కలి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని జడ్పీటీసీ సభ్యురాలిగా ఉన్న దువ్వాడ వాణి ప్రకటించారు.. ఈ నెల 22వ తేదీన నామినేషన్ వేయబోతున్నట్టు.. తన అనుచరుల దగ్గర వాణి ప్రస్తావించడం చర్చగా మారింది.. ఇక, తన భార్య వాణి నామినేషన్ వేస్తానన్న వ్యాఖ్యలపై టెక్కలి వైసీపీ అభ్యర్ధి దువ్వాడ శ్రీనివాస్ స్పందించారు.
Read Also: Chilukuru Temple: చిలుకూరు ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేత
వాణి నా భార్య.. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా నామినేషన్ వేసే, పోటీ చేసే అధికారం ఉంది.. కాదని చెప్పే అర్హత ఎవరికీ లేదన్నారు దువ్వాడ శ్రీనివాస్.. ఏం చేస్తాం.. కలియుగ ప్రభావం.. సొంత అన్నదమ్ములు, కుటుంబం తిరగబడవచ్చు.. కానీ, ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలుగా చెప్పుకొచ్చారు.. అయితే ఆమె నామినేషన్ వేయరనే నేను అనుకుంటున్నాను అన్నారు.. నేను రాత్రికి రాత్రి రెడీమేడ్‌గా తయారైన నాయకుడిని కాదు.. పాతికేళ్ల రాజకీయ జీవితం నాదన్న ఆయన.. దమ్ముంటే తెలుగుదేశం నాయకులు ఏం అభివృద్ధి చేశారో చెప్పాలి? అని నిలదీశారు. టెక్కలి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసింది.. ఈ సారి 25 వేల ఓట్ల మెజార్టీతో టెక్కలిలో విజయం సాధిస్తానన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు ఎమ్మెల్సీ, టెక్కలి వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్..