Site icon NTV Telugu

Dussehra Holidays : రేపటి నుంచి ఇంటర్‌ విద్యార్థులకు దసరా సెలవులు.. కాలేజీలకు బోర్డ్‌ హెచ్చరిక

Inter Student

Inter Student

తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TS BIE) రాష్ట్రంలోని అన్ని జూనియర్ కాలేజీలకు అక్టోబర్ 2 నుండి 9 వరకు దసరా సెలవులను ప్రకటించింది. జూనియర్‌ కళాశాలలు అక్టోబర్ 10న పునఃప్రారంభమవుతాయని తెలంగాణ ఇంటర్‌ బోర్డ్‌ తెలిపింది. అయితే.. సెలవుల షెడ్యూల్‌ను కచ్చితంగా పాటించాలని అన్ని జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లను బోర్డు ఆదేశించింది. దసరా సెలవుల్లో ఎలాంటి తరగతులు నిర్వహించవద్దని ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లు, యాజమాన్యాలను ఆదేశించింది తెలంగాణ ఇంటర్‌ బోర్డ్‌.

 

అయితే.. సూచనల ఉల్లంఘనలు తీవ్రంగా పరిగణించబడతాయని, తప్పు చేసిన యాజమాన్యాలపై డిస్‌ఫిలియేషన్‌తో సహా చర్యలు తీసుకోబడుతాయని బోర్డు హెచ్చరించింది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే తెలంగాణలో పాఠశాలలకు గత నెల 25 నుంచి ఈ నెల 9 వరకు సెలవులను ప్రకటించింది విద్యాశాఖ.

Exit mobile version