Dunki : షారుఖ్ ఖాన్ డంకీ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ఈ ఏడాది రెండు భారీ బ్లాక్ బాస్టర్ హిట్స్ అందుకున్నారు.ఆయన నటించిన పఠాన్ మరియు జవాన్ సినిమాలు ఈ ఏడాది ఏకంగా రూ.1,000కోట్లకు పైగా కలెక్షన్లను సాధించి భారీ విజయం అందుకున్నాయి.ప్రస్తుతం షారుఖ్ ఖాన్ హీరో గా నటించిన లేటెస్ట్ మూవీ ‘డంకీ’.. ఈ సినిమా డిసెంబర్ 21న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాను బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాని తెరకెక్కించారు. ఈ దర్శకుడు గతంలో 3 ఇడియట్స్, పీకే వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు.దీనితో డంకీ సినిమా పై భారీగా అంచనాలు వున్నాయి.ఇదిలా ఉంటే డంకీ సినిమా ట్రైలర్ రిలీజ్ గురించి ఓ వార్త తెగ వైరల్ అవుతుంది.డంకీ సినిమా ట్రైలర్ రేపు (డిసెంబర్ 5) రిలీజ్ కానుందని సమాచారం.ఈ విషయంపై మూవీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది.
డంకీ నుంచి ఇప్పటి వరకు డ్రాప్ అనే పేరుతో వరుస అప్డేట్స్ ఇచ్చిన మూవీ యూనిట్ డంకీ ట్రైలర్ ను కూడా ‘డంకీ డ్రాప్ 4’గా విడుదల చేస్తుందని సమాచారం.డంకీ సినిమా రిలీజ్ కు ఇంకా 16 రోజులే ఉన్న తరుణంలో ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు మూవీ యూనిట్ సిద్ధం అయింది. డంకీ కథ గురించి ముఖ్యమైన పాయింట్స్ ఈ ట్రైలర్లో ఉంటాయని తెలుస్తుంది.విదేశాలకు వీసా లేకుండా వెళ్లాలని అనుకునే స్నేహితుల కథే డంకీ అని సమాచారం.. తమ కలను సాకారం చేసుకునే క్రమంలో వారి జీవితం ఎలా మారిందన్నదే ప్రధాన కథగా ఉంటుంది. కామెడీ, లవ్, ఫ్రెండ్షిప్ మరియు ఎమోషన్స్ తో డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ మార్క్ చిత్రంగా ఉండనుందని టీజర్ చూస్తేనే అర్ధమవుతుంది.డంకీ చిత్రంలో తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, బొమ్మన్ ఇరానీ మరియు విక్రమ్ కొచ్చర్ కీలకపాత్రల్లో నటించారు. ప్రితమ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్, రాజ్‌కుమార్ హిరానీ, ఫిల్మ్స్ మరియు జియో స్టూడియోస్ బ్యానర్లు ఈ మూవీని సంయుక్తంగా నిర్మించాయి
Also Read
- Balka Suman: బాల్క సుమన్‌కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి మెజిస్ట్రేట్
- ‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్‌ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
- Wife Harassment: భార్య వేధిస్తుంది, మరణించే అనుమతి ఇవ్వండి..
- Drushyam 4: దృశ్యం తరహాలో పాల వ్యాపారి స్కెచ్.. చివరికిలా దొరికిపోయాడు
- Tags
- Dunki
- release
- shahrukh khan
- trailer
తాజావార్తలు
-
RCB Playing XI: గుజరాత్ టైటాన్స్‌ను దెబ్బకొట్టేందుకు ఆర్సీబీ పక్కా ప్లాన్.. టీమ్‌లో బిగ్ ఛేంజ్..
-
Premalu 2 : ప్రేమలు 2కి కథ లేదు అందుకే క్యాన్సిల్ చేసాం : నస్లీన్
-
NBK Lineup : తమిళ డైరెక్టర్ తో నందమూరి నటసింహం సినిమా ఫిక్స్?
-
IPL 2026 Final: బెంగళూరుకు బిగ్ షాక్.. గుజరాత్ టైటాన్స్‌దే ఐపీఎల్ 2026 టైటిల్?
-
Balka Suman: బాల్క సుమన్‌కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి మెజిస్ట్రేట్
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..