Sri Sri: గోడెక్కి పూజాతో దుల్కర్ లవ్ ముచ్చట్లు!

Sri Sri Movie

Sri Sri Movie

దుల్కర్ సల్మాన్ హీరోగా నూతన దర్శకుడు రవి నెలకుదిటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ #DQ41. ప్రతిష్టాత్మక ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా ప్రేమ, వినోదం, మనసుని తాకే భావోద్వేగాల మేళవింపుగా వస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ కాగా, దుల్కర్ సల్మాన్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే తొలిసారిగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన వర్కింగ్ స్టిల్స్ ఈ క్రేజీ జోడీపై అంచనాలు పెంచేయగా.. తాజాగా చిత్ర నిర్మాతలు ఈ సినిమా టైటిల్‌ను ప్రకటిస్తూ, ఎంతో ఆహ్లాదకరంగా ఉన్న ఫస్ట్-లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.

ఈ సినిమాకు ‘శ్రీ శ్రీ’ అనే క్లాసిక్ అండ్ ప్లజెంట్ టైటిల్‌ను ఖరారు చేశారు మేకర్స్. దీనికి “లవ్ విల్ స్పార్క్ అగైన్”** అనే క్యాచీ ట్యాగ్‌లైన్‌ను జత చేశారు. ఇక తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ విషయానికొస్తే.. ఇందులో దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే ఇద్దరూ ఒక కాంపౌండ్ గోడపై కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. పాస్టెల్ బ్లూ షర్ట్, కళ్లద్దాలతో దుల్కర్ సిగ్గుపడుతూ చిరునవ్వులు చిందిస్తుండగా.. లైట్ బ్లూ సల్వార్ సూట్‌లో ఉన్న పూజా హెగ్డే అతని వైపు చూస్తూ మురిసిపోతోంది. ఇద్దరి మధ్య ఉన్న ఈ నేచురల్ కెమిస్ట్రీ పోస్టర్‌కే హైలైట్‌గా నిలిచింది. ఇషాన్ సక్సేనా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి టాలీవుడ్ టాప్ టెక్నికల్ టీమ్ వర్క్ చేస్తోంది. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం సమకూరుస్తుండగా, అనయ్ ఓం గోస్వామి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. “శ్రీ శ్రీ” చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.