Ishan Kishan: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బౌలర్లను ‘శత’కొట్టిన ఇషాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ తొలి రోజున ఈస్ట్ జోన్ జట్టు భారీ స్కోరు సాధించి బలమైన స్థితిలో నిలిచింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ అద్భుతమైన శతకంతో చెలరేగడంతో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఈస్ట్ జోన్ 4 వికెట్ల నష్టానికి 385 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఈస్ట్ జోన్‌కు ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, అభిమన్యు ఈశ్వరన్ శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు వీరిద్దరూ 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ 37 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 44 పరుగులు చేసి, అర్ధశతకం చేసే అవకాశాన్ని తృప్తిలో చేజార్చుకున్నాడు. చామా మిలింద్ బౌలింగ్‌లో వైభవ్ అవుటైనప్పటికీ తన అటాకింగ్ బ్యాటింగ్‌తో అభిమానులను అలరించాడు. అనంతరం మైదానంలో అభిమానులకు ఆటోగ్రాఫ్‌లు ఇస్తూ కనిపించడం విశేషం.
అభిమన్యు ఈశ్వరన్ (72) బాధ్యతాయుతంగా ఆడి జట్టుకు మంచి పునాది వేశారు. అనంతరం వచ్చిన శిఖర్ మోహన్ (85) నిలకడైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ఒక దశలో 147 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఈస్ట్ జోన్ కొంత కష్టాల్లో పడగా, ఇషాన్ కిషన్, శిఖర్ మోహన్ నాలుగో వికెట్‌కు 94 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఈ మ్యాచ్ ద్వారా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 4,000 పరుగులు పూర్తి చేసిన ఇషాన్ కిషన్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 71 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్న ఇషాన్, తర్వాతి 50 బంతుల్లోనే ఫస్ట్ క్లాస్ కెరీర్లో 10వ సెంచరీని అందుకున్నాడు. ప్రస్తుతం 111 పరుగులతో ఇషాన్ నాటౌట్‌గా ఉన్నాడు.
Also Read
- TPCC Mahesh Goud : సురేఖ ఎపిసోడ్‌పై మహేష్ గౌడ్ క్లారిటీ
- Bigg Boss 10 Telugu Live: బిగ్‌బాస్ సీజన్ 10 లైవ్ అప్డేట్స్.. హౌస్‌లోకి కంటెస్టెంట్స్ ఎంట్రీ..
- NTR Bharosa Pensions: ఎన్టీఆర్ భరోసా పింఛన్లు.. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఇలా..
- Iran-Israel War: ఒకేసారి నాలుగు వైపుల నుంచి ఇజ్రాయెల్‌పై దాడి? ఇరాన్ భారీ వ్యూహం
శిఖర్ మోహన్ అవుటైన తర్వాత, మరో వికెట్ పడకుండా కిషన్, కుమార్ కుషాగ్రా (63 నాటౌట్) కలిసి జాగ్రత్తగా ఆడారు. ఐదో వికెట్‌కు వీరిద్దరూ ఇప్పటికే 144 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇషాన్ కిషన్ 135 బంతుల్లో 14 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 133 పరుగులతో నాటౌట్‌గా నిలిచి, జట్టుకు భారీ ఆధిక్యాన్ని అందించాడు. సౌత్ జోన్ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఈస్ట్ జోన్ తొలి రోజే పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించింది.
తాజావార్తలు
-
Ishan Kishan: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బౌలర్లను ‘శత’కొట్టిన ఇషాన్..
-
TPCC Mahesh Goud : సురేఖ ఎపిసోడ్‌పై మహేష్ గౌడ్ క్లారిటీ
-
Harish Rao : కేసీఆర్ రాజీనామా డైవర్షన్ పాలిటిక్స్..
-
Bigg Boss 10 Telugu Live: బిగ్‌బాస్ సీజన్ 10 లైవ్ అప్డేట్స్.. హౌస్‌లోకి కంటెస్టెంట్స్ ఎంట్రీ..
-
NTR Bharosa Pensions: ఎన్టీఆర్ భరోసా పింఛన్లు.. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఇలా..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!