NTV Telugu Site icon

Duleep Trophy 2024: నేటి నుంచే రెండో రౌండ్‌.. అందరి దృష్టి శ్రేయస్‌పైనే!

Sarfaraz, Shreyas

Sarfaraz, Shreyas

దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ దులీప్‌ ట్రోఫీలో రెండో రౌండ్‌కు రంగం సిద్ధమైంది. నేటి నుంచి రెండో రౌండ్‌ మ్యాచ్‌లు ఆరంభం కానున్నాయి. నేడు అనంతపురంలోని రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ స్టేడియంలో ఇండియా-ఎ, ఇండియా-డి జట్లు తహలపడనుండగా.. రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ స్టేడియం బిలో ఇండియా-బి, ఇండియా-సి టీమ్స్ తలపడనున్నాయి. రెండు మ్యాచ్‌లు ఉదయం 9.30 గంటలకు ఆరంభం కానున్నాయి. తొలి రౌండ్లో ఇండియా-బి, ఇండియా-సి విజయాలు సాధించగా.. ఇండియా-ఎ, ఇండియా-డి ఓడిపోయాయి. రెండో గెలుపుపై బి, సి జట్లు గురిపెట్టగా.. బోణీ కొట్టాలని ఎ, డి భావిస్తున్నాయి.

రింకు సింగ్, శ్రేయస్‌ అయ్యర్, వాషింగ్టన్‌ సుందర్‌లకు బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు భారత జట్టులో చోటు దక్కలేదు. రెండో రౌండ్లో సత్తాచాటితే బంగ్లాతో రెండో టెస్టుకు బీసీసీఐ సెలెక్టర్ల నుంచి పిలుపు రావొచ్చని ఈ ముగ్గురు ఆశాభావంతో ఉన్నారు. ముఖ్యంగా శ్రేయస్‌ భారీ ఇన్నింగ్స్ ఆడి భారత జట్టులోకి రావాలని చూస్తున్నాడు. ప్రస్తుతం భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న ఆటగాళ్లలో సర్ఫరాజ్‌ ఖాన్‌ మాత్రమే దులీప్‌ ట్రోఫీ ఆడనున్నాడు. బంగ్లాతో తొలి టెస్టుకు అతడు ఎంపికయినా.. తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు లేవు. న్యూజీలాండ్, ఆస్ట్రేలియా సిరీస్‌ల నేపథ్యంలో కేఎల్ రాహుల్‌కు అవకాశం దక్కనుంది.

Also Read: ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్‌తో భారత్‌కు ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా?

ముషీర్‌ ఖాన్‌, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, నవదీప్‌ సైనీ, ముకేశ్‌ కుమార్‌పై ఇండియా-బి భారీగా ఆశలు పెట్టుకుంది. ఇండియా-బిని అభిమన్యు ఈశ్వరన్‌ నడిపించనున్నాడు. రుతురాజ్‌ గైక్వాడ్ సారథ్యంలోని ఇండియా-సి జట్టు సాయి సుదర్శన్, రజత్‌ పాటిదార్, బాబా ఇంద్రజిత్, మానవ్‌ సుతార్‌లపై ఆధారపడనుంది. ఇండియా-ఎకు మయాంక్‌ అగర్వాల్ కెప్టెన్‌ కాగా.. రియాన్‌ పరాగ్, తిలక్‌ వర్మ, శివమ్‌ దూబె, ప్రసిద్ధ్‌ కృష్ణ, ఖలీల్‌ అహ్మద్, అవేష్‌ ఖాన్‌ వంటి భారత స్టార్స్ జట్టులో ఉన్నారు. ఇండియా-డికి శ్రేయస్‌ అయ్యర్ సారథి కాగా.. దేవ్‌దత్‌ పడిక్కల్, సంజు శాంసన్, రికీ భుయ్, అర్ష్‌దీప్‌ సింగ్, హర్షిత్‌ రాణా, శ్రీకర్‌ భరత్‌ జట్టులో ఉన్నారు.

Show comments