NTV Telugu Site icon

Delhi: తీవ్రస్థాయిలో నీటి కష్టాలు.. ట్యాంకర్ రాగానే ఎగబడ్డ జనాలు

Water

Water

దేశ రాజధాని ఢిల్లీలో నీటి కష్టాలు తీవ్రమయ్యాయి. గత కొద్ది రోజులుగా మంచినీళ్ల కోసం ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. కనీస అవసరాలు తీరక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు తీవ్రమైన ఎండలు.. ఇంకోవైపు నీటి ఎద్దడి.. దీంతో హస్తిన వాసుల ఇక్కట్లు మామూలుగా లేవు. ఇక చిన్న పిల్లలు, వృద్ధుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. తాగేందుకు కూడా నీళ్లు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు.

ఇది కూడా చదవండి: Telangana BJP: నేడు ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ధర్నా..

ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వం ట్యాంకర్ల ద్వారా ప్రజలకు నీటిని సరఫరా చేస్తున్నారు. అయితే చాణక్యపురి సంజయ్ క్యాంపు ప్రాంతంలో నీటి ట్యాంకర్ రాగానే జనాలు ఎగబడ్డారు. కొందరు యువకులు ట్యాంకర్ రన్నింగ్‌లో ఉండగానే పైకి ఎక్కి పైపుల ద్వారా నీళ్లు నింపుకునే ప్రయత్నాలు చేశారు. మరికొంత మంది ఆ ప్రయత్నాలు చేయలేక ఇబ్బందులు పాలయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారాయి.

ఇది కూడా చదవండి: Remal Cyclone : అస్సాంలో ‘రెమాల్’ తుఫాను..ఐదుగురు మృతి.. 42 వేల మందిపై ప్రభావం

మరోవైపు ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నీటి వృధా చేస్తే రూ. 2 వేలు ఫైన్ వేస్తామని హెచ్చరించింది. కార్లు, బైకులు కడగడానికి గానీ.. వాణిజ్య అవసరాలకు ఉపయోగించిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. ఇందుకోసం ఆయా ప్రాంతాల్లో బృందాలను ఏర్పాటు చేసింది. ఇక హర్యానా నుంచి ఢిల్లీకి రావాల్సిన నీటి వాటాపై చర్చిస్తామని ఇప్పటికే ఆప్ మంత్రి అతిషీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ కుట్రతోనే ఈ నీటి కష్టాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తోంది.