Duddilla Sridhar Babu : ఇండస్ట్రియల్ భూముల పరిరక్షణపై ఫోకస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో పరిశ్రమల విస్తరణ, అభివృద్ధి నేపథ్యంలో టీఎస్ఐఐసి విభాగపు అధికారులతో మంత్రి శ్రీధర్ బాబు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. బషీర్‌బాగ్ లోని సంస్థ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సంస్థ కార్యకలాపాలు, విభాగాల పనితీరు, ల్యాండ్ బ్యాంకు, భూకేటాయింపులు, వాటి వినియోగం తదితర అంశాలపై పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జేయేశ్ రంజన్, సంస్థ ఎండి విష్ణువర్ధన్ రెడ్డి, సంస్థ అధికారులతో కలిసి సమీక్షించారు.
రాష్ట్ర విభజనకు ముందు జరిగిన భూకేటాయింపులు, తర్వాత జరిగిన కేటాయింపుల పై మంత్రి సమీక్షించారు. 2014 తర్వాత జరిగిన భూ కేటాయింపులు, ఏయే కంపెనీలు యెంత మేర, ఏ అవసరాల నిమిత్తం భూమి పొందింది, ప్రస్తుత వినియోగం ఎంత, నిరుపయోగంగా ఉన్న భూముల వ్యవహారాలపై మంత్రి ఆరా తీశారు. ఏళ్ళు గడిచిన సంబంధిత కంపెనీలు భూములు వినియోగించుకోకపోవడం పై అధికారుల ద్వారా ఆరా తీశారు. భూములు పొందిన సంస్థలు వారి ప్రయోజనాలకు కాకుండా థర్డ్ పార్టీలకు లీజుకు ఇచ్చిన అంశాలపై ఆరా తీశారు, అలా థర్డ్ పార్టీలకు జరిగిన లీజు అగ్రిమెంట్లు, పొందుతున్న ఆదాయం అంశాలపై నివేదిక సమర్పించాలని సంస్థ ఉన్నతాధికారులను ఆదేశించారు.
Also Read
- RCB Champion: ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం.. రెండో సారి కప్ అందుకున్న RCB..
- Vaibhav Sooryavanshi: కోహ్లీ, గిల్, యశస్వి జైస్వాల్‌ను వెనక్కి నెట్టిన వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల వయస్సులోనే అరుదైన రికార్డు..
- Virat Kohli: ఆకాశమే హద్దుగా చెలరేగిన విరాట్ కోహ్లీ.. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో అరుదైన రికార్డు సాధించిన కింగ్..
- GT Vs RCB: వార్ వన్ సైడ్ అయిపోయింది.. ఫైనల్ మజా రావడం లేదు.. నిరాశలో అభిమానులు..
గతంలో భూములు పొంది, ఈడీ , సిబిఐ లాంటి సంస్థలు జప్తు చేసిన భూములపై హక్కు తిరిగి పొందేలా న్యాయస్థానాల్లో పోరాటం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. జాయింట్ వెంచర్ లో భాగంగా పలు సంస్థలు, కంపెనీలు డివిడెండ్, షేర్ హోల్డ్ అమౌంట్ చెల్లించని అంశాలపై మంత్రి నివేదిక అందించాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ఏర్పాటు జరిగిన పలు పారిశ్రామిక పార్కుల ప్రస్తుత పరిస్థితిపై సంస్థ అధికారులు మంత్రికి వివరించారు. టీఎస్ఐఐసి అధికారులు అందరు అందుబాటులో ఉండాలని, చాలా జిల్లాల్లో ప్రజాప్రతినిధులకు అధికారుల అందుబాటు ఉండటం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయని, ఎల్లప్పుడు అందుబాటులో ఉండేలా చూసుకోవాల్నయి సూచించారు.
రాష్ట్ర అభివృద్ధిలో పరిశ్రమల శాఖ అధికారుల కృషి చాల ఉందని, మరింతగా సంస్థ అభివృద్ధి కోసం సూచనలు, సలహాలతో పాటు సమస్యలు కూడా లిఖిత పూర్వకంగా ఇవ్వాలని ఉద్యోగులకు మంత్రి సూచించారు. ప్రతి అధికారి ఫీల్డ్ విసిట్ చేసి, కేటాయించిన భూములు, సంబంధిత కంపెనీ వినియోగించ భూమి, ఒక వేళా ఎందుకు వినియోగించలేదు అన్నదానిపై కారణం, తదితర అన్ని వివరాలతో త్వరితగతిన నివేదిక అందించాలని సంస్థ ఎండిని మంత్రి ఆదేశించారు.
తాజావార్తలు
-
RCB Champion: ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం.. రెండో సారి కప్ అందుకున్న RCB..
-
Vaibhav Sooryavanshi: కోహ్లీ, గిల్, యశస్వి జైస్వాల్‌ను వెనక్కి నెట్టిన వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల వయస్సులోనే అరుదైన రికార్డు..
-
Virat Kohli: ఆకాశమే హద్దుగా చెలరేగిన విరాట్ కోహ్లీ.. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో అరుదైన రికార్డు సాధించిన కింగ్..
-
GT Vs RCB: వార్ వన్ సైడ్ అయిపోయింది.. ఫైనల్ మజా రావడం లేదు.. నిరాశలో అభిమానులు..
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
ట్రెండింగ్
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!