NTV Telugu Site icon

Duddilla Sridhar Babu : ఓర్వ లేక ఉత్తమ్‌పై ఆరోపణలు చేస్తున్నారు

Duddilla Sridhar Babu

Duddilla Sridhar Babu

రాష్ట్ర వ్యాప్తంగా 99 రోజులు పరిపాలన యంత్రాంగం ని గాడిలో పెట్టామని, వంద రోజులు కాకముందే ఎన్నికల కోడ్ వచ్చిందన్నారు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు. బీఆర్‌ఎస్‌, బీజేపీ వాళ్ళ ని మేము మీ అనుభవాలు చెప్పండి అని కోరినమని, పరిపాలన లో మీరు చేసిన పొరపాట్లు మేము చేయొద్దు అని సలహా ఆడిగామన్నారు. మేడిగడ్డ పోయినప్పుడు కూడా సీఎం.. అందరిని రమ్మన్నారని, చూసి సలహాలు ఇవ్వండి అని ఆడిగామన్నారు. ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఏదంటే అది మాట్లాడారని, కేసీఆర్.. కేటీఆర్..హరీష్ లు..సమాధానం చెప్పండని మంత్రి శ్రీధర్‌ బాబు అన్నారు. 2018 లో అధికారం ఇస్తే.. 40 రోజుల తర్వాత mla ప్రమాణ స్వీకారం చేశారని, కానీ మేము 40 రోజుల్లో మేము హామీల అమలు మొదలుపెట్టినమన్నారు శ్రీధర్‌బాబు.

అంతేకాకుండా..’Mgm ఆసుపత్రిలో మీ హయం లో పేషేంట్ కాలు ఎలుకలు కొరికాయి. హరీష్ రావు.. దీనికి సమాధానం చెప్పు. అప్పటి నుండి ఇప్పటి వరకు మాట మాట్లాడలేదు. . మీరు పెట్టిన యంత్రంగమే కదా. మేము కొత్త యంత్రంగా పెట్టామా..? ఓర్వ లేక ఉత్తమ్ పై ఆరోపణలు చేస్తున్నారు. శాఖని గాడిలో పెడుతున్నారు అని జీర్ణించుకోలేక పోతున్నారు. అధికారంలోకి వచ్చి మూడు నెలలు అయ్యింది. ఇంకా ఎన్నికపై కోడ్ నడుస్తుంది. కంపెనీలు పోతున్నాయి అంటున్నాడు కేటీఆర్. ఎక్కడికి పోయాయి. ఎం కంపెనీలు పోయాయి చెప్పు. ఉన్న కంపెనీలు అన్నీ ఇక్కడే ఉన్నాయి. నీ హయాంలో 20 వేళా కోట్ల పెట్టుబడులు వస్తే.. మా హయాంలో 40 వేల కోట్ల పెట్టుబడులు తెచ్చాం. ఇంకో 9 వేళా కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి. కార్ని0గ్ సంస్థ mou నే కుదుర్చుకోలేదు. ఆ సంస్థ పోయింది అని కేటీఆర్ ప్రచారం చేస్తున్నారు. ఆ కంపెనీ పోతే దాని అయ్య లాంటి సంస్థలను తేస్తాం. కాంగ్రెస్ ని ఓడించడానికి బీజేపీ.. బీఆర్‌ఎస్‌ ఎన్నికల రెండు రోజుల ముందు ఒక్కటి అయ్యారు.’ అని మంత్రి శ్రీధర్‌ బాబు అన్నారు.