NTV Telugu Site icon

Duddilla Sridhar Babu : మూసీ బాధితులను ఆదుకుంటాం.. ఎవరినీ విస్మరించం

Duddilla Sridhar Babu

Duddilla Sridhar Babu

మూసీ బాధితులను ఆదుకుంటాం.. ఎవరిని విస్మరించమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఎన్టీఓల సలహాలు సూచనలతో ముందుకు వెళ్తున్నామని, రివర్ బెల్ట్ లో.. భూసేకరణ చట్టం అమలు చేస్తామన్నారు శ్రీధర్‌ బాబు. బీఆర్‌ఎస్‌లో కొందరు నేతలు బూతద్దం లో పెట్టీ చూపెట్టే పనిలో ఉన్నారని, FTL దాచిపెట్టి అమ్మిన బిల్డర్స్ పై చర్యలు తీసుకుంటామన్నారు. అనుమతులు ఇచ్చిన అధికారులు… వారిపై ఒత్తిడి తెచ్చింది ఎవరన్నది బయట పెడతామని, త్వరలో హెల్ప్ డెస్కులు.. హైడ్రా.. మూసీ పరివాహక ప్రజల అనుమానాల పై కలెక్టరేట్ లో హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బీఆర్‌ఎస్‌ వాళ్ళు మొసలి కన్నీరు కారుస్తున్నారని,
మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు ఏం చేశారని ఆయన తెలిపారు. మల్లారెడ్డి అనే రైతు చితి పెట్టుకుని నిప్పు అంటించుకున్నారని, భూ నిర్వాసితులకు చట్టం అమలు చేయాల్సింది పోయి కొత్త GO తెచ్చారన్నారు. ప్రాజెక్టులు కడితే మా ఇండ్లు కూడా పోయాయి అని కేసీఆర్.. కేటీఆర్ అన్నారు గతంలో.. ఇప్పుడేమో ప్రజల్ని ఉసికొలుపుతున్నారన్నారు.

Hezbollah: హసన్ నస్రల్లా ఎక్కడ ఉన్నాడో చెప్పింది ఇరాన్ గూఢచారి.. ఆ తర్వాతే ఇజ్రాయిల్ ఎటాక్..

అంతేకాకుండా..’మేము మల్లన్న సాగర్ వెళ్తాం అంటే.. పోలీసులను పెట్టీ అరెస్టు చేశారు. మేము brs వాళ్ళను ఇప్పుడు ఎక్కడైనా అడ్డుకునామా? మాది ప్రజా పాలన కాబట్టి.. బాధితుల వద్దకు కూడా brs వాళ్ళను వెళ్ళనిచ్చం. ప్రజల ఇబ్బందికి సలహాలు ఇస్తారని అడ్డుకోలేదు. కొందరి అత్యుత్సాహం తో ప్రజలు కొంత ఆందోళన కి గురి కావచ్చు. నోటీసులు ఇచ్చిన తర్వాతనే చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. సోషల్ మీడియా లో ఐదు వేలు ఇచ్చి సిఎం పైనా మాట్లడిస్తున్నారు. వాటిపై విచారణ జరిపిస్తాము. అక్రమ నిర్మాణాలు ఇచ్చిన అధికారులు… బిల్డర్స్ పై చర్యలు ఉంటాయి. తప్పుడు పెపర్స్ తో అనుమతులు ఇచ్చిన వారిపైనా చర్యలు ఉంటాయి. బుల్డోజర్ పాలసీ బీఆర్‌ఎస్‌ది.. అక్రమ నిర్మాణం పై బుల్డోజర్ పోయింది..అది తప్పా.. అక్రమ నిర్మాణం కి మద్దతు ఇస్తున్నారా బీఆర్‌ఎస్‌ వాళ్ళు.. మల్లన్న సాగర్ రైతులపై బుల్డోజర్ పెట్టింది బీఆర్‌ఎస్‌..’ అని మంత్రి శ్రీధర్‌ బాబు అన్నారు.

Merugu Nagarjuna: ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోంది..