NTV Telugu Site icon

Kadapa DSP: కడప జిల్లాలో 144 సెక్షన్.. రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే కేసులే..

Kadapa

Kadapa

కడప నగరంలోని డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ షరీఫ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు, నాయకుల సహకారంతో జిల్లాలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామన్నారు. కౌంటింగ్ కు నాయకులు సహకరించాలని కోరారు. జూన్ 3వ తేదీ మధ్యాహ్నం నుంచి కడపలో ఇతర జిల్లాల వారు ఖాళీ చేయాలి.. ఆర్టీసీ బస్సులను నగర శివారులో నడపడం జరుగుతుంది అని ఆయన పేర్కొన్నారు. జిల్లా మొత్తం 144 సెక్షన్ అమలులో ఉంటుంది.. కౌంటింగ్ నేపథ్యంలో షాపులు మొత్తం బంద్ చేయండం జరుగుతుందన్నారు. దీనికి ప్రజలందరూ సహకరించాలి అని డీఎస్పీ షరీఫ్ కోరారు.

Read Also: Pushpa 2 : పుష్ప 2 నుంచి సెకండ్ సాంగ్ వచ్చేసింది..

ఇక, ఇతర జిల్లాల నుంచి ఎవరు రాకూడదు అంటూ కడప డీఎస్పీ షరీఫ్ తెలిపారు. అలాగే, సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడితే కేసులు నమోదు చేస్తాం.. ఫంక్షన్ హాళ్లు, లాడ్జీలను పోలీసుల పర్మిషన్ లేకుండా ఎవరికి ఇవ్వకూడదు.. జిల్లా అధికారుల సూచనల మేరకు మద్యం షాపులకు సడలింపులు ఇవ్వడం జరుగుతుంది.. జిల్లా కలెక్టర్ పర్మిషన్ లేకుండా ఇతర వ్యక్తులు రాకూడదు అని ఆయన చెప్పుకొచ్చారు. నగర శివారులో 7 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది.. సీసీ కెమెరాల ద్వారా క్షుణ్ణంగా పర్యవేక్షిస్తున్నాం.. స్ట్రాంగ్ రూమ్ బయట నాలుగు అంచాల భద్రత ఏర్పాటు చేయడం జరిగింది డీఎస్పీ షరీఫ్ తెలిపారు.

Read Also: OG : పవన్ మూవీ కోసం మరో మాస్ ఫీస్ట్ రెడీ చేస్తున్న తమన్..

అలాగే, జూన్ 3వ తేదీన పార్టీ కార్యాలయాలు బంద్ చేయడంతో పాటు సీసీ కెమరాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది అని డీఎస్పీ షరీఫ్ చెప్పారు. కడప సబ్ డివిజన్ ఎటువంటి ర్యాలీలు, అల్లర్లకు పాల్పడకూడదు.. నాయకులు, ప్రజలు పోలీసులకు సహకరించాలి.. కడప సబ్ డివిజన్ లో నలుగురి మీద రౌడి షీటర్లు నమోదు చేయడం జరిగిందన్నారు. పద్మవ్యూహం లాంటి టీంను ఏర్పాటు చేయడం జరుగుతుంది.. ప్రజలందరూ శాంతియుతంగా ఉండాలి.. ఎవరైనా అల్లర్లు చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.