విద్యాబుద్ధులు నేర్పాల్పిన పాఠశాల మందుబాబులకు అడ్డాగా మారింది. పాఠశాలలో మందుబాబు వీరంగం సృష్టించడంలో భయభ్రాంతులకు గురయ్యారు స్కూల్ విద్యార్థినులు. గుర్తు తెలియని వ్యక్తి మద్యం సేవించి పాఠశాలలోకి అక్రమంగా ప్రవేశించి హల్చల్ చేయడంతో విద్యార్థినిలు భయంతో పరుగులు పెట్టారు. ఈ సంఘటన సత్యసాయి జిల్లా ముదిగుబ్బ గ్రామంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలో చోటుచేసుకుంది. పాఠశాలలోకి గుర్తుతెలియని వ్యక్తి ఫుల్లుగా మద్యం సేవించి ప్రవేశించాడు.
Read Also: Dry Cough: పొడి దగ్గు తగ్గట్లేదా.. ఈ చిట్కాలతో వెంటనే ఉపశమనం
పాఠశాల వెనుక భాగాన ఉన్న ప్రహరీ గోడ దూకి స్కూలు లోపలికి ప్రవేశించి విద్యార్థినిల పట్ల అసభ్య ప్రవర్తించాడు. దీంతో విద్యార్థినిలు అతడిని చూసి భయంతో పరుగులు తీశారు. విషయం గమనించిన ఉపాధ్యాయినులు అతని వేషధారణ చూసి గట్టిగా నిలదీయగా తాగిన మైకంలో దురుసుగా ప్రవర్తించడంతో దగ్గర్లో ఉన్న స్థానికులను పిలిచారు. వారంతా వచ్చే సమయానికి పాఠశాల బయట ఉన్న ఒక ఇంటి బాత్రూంలో దాక్కొని అందరిని భయపెట్టాడు. చుట్టుపక్కల ఉన్న స్థానికులు పిల్లల భయపడుతున్న విషయం చూసి అతనిని బాత్రూం నుంచి బయటకు లాక్కొని వచ్చి చెట్టుకు కట్టేశారు. అతడిని విచారించగా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో గ్రామస్తులు విషయం పోలీసులకు తెలియజేసి అతనిని పోలీసులకు అప్పచెప్పారు.
Read Also: Baaz Electric Scooter: 35 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్స్ చూస్తే దిమ్మతిరగాల్సిందే!