Site icon NTV Telugu

Chhattisgarh: మద్యం మత్తులో పోలీసులతో యువతి హల్‌చల్.. వీడియో వైరల్

Chhattisgarh

Chhattisgarh

మద్యం మత్తులో ఓ యువతి హంగామా సృష్టించి కటకటాల పాలైంది. ఈ ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రం కోర్బాలో జిల్లాలో చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి పాష్ పామ్ మాల్ ప్రాంతంలో ఉన్న ఓఎన్‌సీ బార్ వెలుపల పెద్ద ఎత్తున గొడవ జరిగింది. మద్యం మత్తులో ఉన్న యువకులు, యువతుల బృందం బహిరంగ ప్రదేశంలో గొడవ సృష్టించింది. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. వీళ్లు రాత్రి ఆలస్యంగా బార్ నుంచి బయటకు వచ్చారు. అనంతరం తమలో తాము గొడవ పడటం ప్రారంభించారు. దాడికి కూడా యత్నించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

READ MORE: Minister Anam: ప్రజలు 11 సీట్లతో బుద్ధి చెప్పినా.. వైసీపీ నేతల్లో మార్పు రాలేదు

సమాచారం అందుకున్న కోర్బా పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ మహిళలు పోలీసులతో దురుసుగా ప్రవర్తించి గొడవ కొనసాగించారు. పోలీసులు పరిస్థితిని అదుపు చేయడానికి ప్రయత్నించారు. కానీ మహిళలు పోలీసులతో కూడా గొడవకు దిగారు. మీడియాలో వైరల్ అవుతోంది. సంఘటన స్థలంలో ఉన్న వ్యక్తులు వీడియో తీశారు. వీడియోలో ఓ యువకుడు, మహిళ పోలీసుల ముందు కూడా అసభ్యకరమైన భాషను ఉపయోగించడం, దురుసుగా ప్రవర్తించడం చూడవచ్చు. ప్రస్తుతం పోలీసులు వీడియో ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. ఈ అంశంపై స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

READ MORE: CM Chandrababu: అమరావతిలో ప్రైవేట్, ప్రభుత్వ సంస్థల నిర్మాణాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

Exit mobile version