Site icon NTV Telugu

Drunken Drive : ట్యాంక్ ఫుల్‌గా తాగి.. ట్రాఫిక్ పోలీసులకు ట్యాంకర్ డ్రైవర్…

Drunken Drive

Drunken Drive

Drunken Drive : హైదరాబాద్‌లో మద్యం మత్తులో వాహనం నడిపిన ఓ వాటర్ ట్యాంకర్ డ్రైవర్ ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన పంజాగుట్ట ప్రాంతంలో జరిగింది. వివరాల్లోకి వెళితే, ఉప్పల్ నుండి పంజాగుట్ట మీదుగా అమీర్‌పేట వైపు వెళ్తున్న ఓ వాటర్ ట్యాంకర్‌ను ట్రాఫిక్ పోలీసులు అనుమానంతో ఆపి తనిఖీ చేపట్టారు. పంజాగుట్ట ట్రాఫిక్ ఎస్‌ఐ ఆంజనేయులు ట్యాంకర్ డ్రైవర్ యాదగిరిపై బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించగా, 325 బ్లడ్ అల్కహాల్ కంటెంట్ (BAC) పాయింట్స్ నమోదయ్యాయి. ఇది అనుమతించిన పరిమితికి మించిపోయిందని గుర్తించిన పోలీసులు షాక్‌కు గురయ్యారు.

డ్రైవర్ పూర్తిగా మద్యం మత్తులో ఉండటంతో, అతని మీద పోలీసులు కేసు నమోదు చేశారు. మద్యం సేవించి వాహనం నడిపినందుకు అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అనంతరం ట్రాఫిక్ పోలీసులు ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకుని, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ట్రాఫిక్ పోలీసులు మద్యం మత్తులో డ్రైవింగ్‌కు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఇంకా కొందరు డ్రైవర్లు రూల్స్‌ను ఉల్లంఘిస్తూ ప్రమాదకరంగా వాహనాలను నడుపుతున్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై తనిఖీలను మరింత కఠినతరం చేయనున్నట్లు తెలిపారు. ఈ ఘటన మరొకసారి మద్యం మత్తులో వాహనం నడపడం ఎంతటి ప్రమాదానికి దారి తీస్తుందో స్పష్టం చేసింది. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు గౌరవించి, రోడ్డుపై ప్రయాణించే ప్రతి ఒక్కరి భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులు హెచ్చరించారు.

Minister Satya Kumar: రాష్ట్రంలో 73 వేల క్యాన్సర్ కేసులు.. నాలుగు లక్షల మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు

Exit mobile version