Jangaon: మద్యం మత్తులో హల్చల్.. బస్టాండ్ నుంచి ఆర్టీసీ అద్దె బస్సును ఎత్తుకెళ్లిన వ్యక్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jangaon: జనగామ జిల్లాలో మద్యం మత్తులో ఓ వ్యక్తి చేసిన నిర్వాకం కలకలం రేపింది. జనగామ ఆర్టీసీ బస్టాండ్‌లో నిలిపి ఉంచిన అద్దె బస్సును ఎవరికి తెలియకుండా స్టార్ట్ చేసి తీసుకెళ్లాడు. సుమారు 21 కిలోమీటర్లు బస్సును నడిపించి చివరకు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘటనతో ప్రయాణికులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
పోలీసుల వివరాల ప్రకారం.. ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ వాహనంలోనే తాళాలు వదిలేసి ఇంటికి వెళ్లాడు. ఇదే అవకాశంగా భావించిన పాలకుర్తి మండలం చెన్నూరుకు చెందిన డోజర్ డ్రైవర్ జిట్టబోయిన వెంకన్న మద్యం మత్తులో బస్సును స్టార్ట్ చేసి అక్కడి నుంచి సూర్యాపేట వైపు తీసుకెళ్లాడు. జనగామ నుంచి బస్సును నడిపిస్తూ వెళ్లిన వెంకన్న, దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి టోల్గేట్ సమీపానికి చేరుకున్నాడు. అక్కడ బస్సు అదుపు తప్పి సిమెంట్ దిమ్మెను ఢీకొట్టింది. ప్రమాదాన్ని గమనించిన టోల్గేట్ సిబ్బంది అనుమానంతో వెంటనే దేవరుప్పుల పోలీసులకు సమాచారం అందించారు.
Also Read
- Ambati Rambabu: రావణ్‌పై యూఏపీఏ కేసు అన్యాయం.. పోరాటానికి మా మద్దతు
- Botsa Satyanarayana: గవర్నర్‌కు బొత్స లేఖ.. విశాఖలో వద్దు.. విజయనగరం మార్చండి..!
- AP Cabinet: ఏపీ కేబినెట్ భేటీ.. పవన్ కల్యాణ్ సహా ఐదుగురు మంత్రుల డుమ్మా..!
- BCCI: "చేసిన ప్రయోగాలు చాలు.. నువ్వు వెళ్ళిపోరా బాబు".. గౌతమ్ గంభీర్‌పై వేటుకు బీసీసీఐ సిద్ధం..?
సమాచారం అందుకున్న దేవరుప్పుల పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని నిందితుడు వెంకన్నను బస్సుతో సహా అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతడిని జనగామ పోలీసులకు అప్పగించారు. అద్దె బస్సు యజమాని గంట గోపికృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు జనగామ సీఐ సత్యనారాయణరెడ్డి కేసు నమోదు చేశారు. నిందితుడు మద్యం మత్తులోనే బస్సును ఎత్తుకెళ్లాడా.? ఘటనకు దారితీసిన పూర్తి పరిస్థితులు ఏంటి.? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
-
Jangaon: మద్యం మత్తులో హల్చల్.. బస్టాండ్ నుంచి ఆర్టీసీ అద్దె బస్సును ఎత్తుకెళ్లిన వ్యక్తి
-
Karur Stampede: కరూర్ తొక్కిసలాట కేసు.. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు.. విజయ్ ప్రభుత్వానికి హైకోర్టు అనుమతి
-
BCCI Review: గంభీర్ భవితవ్యంపై బీసీసీఐ సమీక్ష.. షాకింగ్ నిర్ణయాలు ఏమైనా ఉంటాయా?
-
Ambati Rambabu: రావణ్‌పై యూఏపీఏ కేసు అన్యాయం.. పోరాటానికి మా మద్దతు
-
IND vs ENG: అతడు ఎందుకు దండగ.. ఎప్పుడో జట్టు నుంచి తప్పించాల్సింది!
ట్రెండింగ్
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!