కూరగాయాలలో మునగకు ప్రత్యేక స్థానం ఉంది.. ఎప్పటికి వీటికి డిమాండ్ ఉంటుంది.. అందుకే రైతులు ఎక్కువగా వీటిని పండించడానికి రైతులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.. మునగ కాయతో మాత్రమే కాదు.. ఆకులు, గింజలు, బెరడు, వేర్ల వంటి అన్ని భాగాలు ఔషధ గుణాన్ని కలిగి ఉంటాయి.. సాధారణంగా ఇది ఉష్ణమండల పంట. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉంటే పూత రాలిపోతుంది. మంచు, చలిని అంతగా తట్టుకోలేదు. అధిక సేంద్రియ పదార్థం కలిగిన గరప నేలలు సాగుకు అనుకూలం..
మునగ సాగుకు అనువైన రకాలు..
సాగుకు P.K.M-1 అనే ఏ వార్షిక అనువైనది. మొక్క 4.6 మీటర్ల ఎత్తు వరకు పెరిగి 160-170 రోజుల్లో పూతకు వస్తుంది. కాయ పొడవు 65-70 సెంటీ మీటర్లు ఉండి, 150గ్రా. బరువుంటుంది. మొక్కకు 35 కిలోల దిగుబడి అంటే దాదాపు 200-230 కాయల వరకు కాపు వస్తుంది.. ఒకసారి పంట వేస్తె మూడేళ్ల వరకు దిగుబడి ఉంటుంది..ఎకరాకు 250గ్రా. విత్తనం లేదా 640 మొక్కలు అవసరం పడతాయి. నారు పెంచడానికి 4×9 అంగుళాల పాలిథీన్ సంచుల్లో ఎర్రమట్టి, పశువుల ఎరువు అవసరం.. వీటిని 30 నుంచి 40 రోజుల మొక్కలను పొలంలో నాటుకోవాలి..
ఈ మునగను జూన్-ఆగస్టు మధ్య నాటుకుంటే ఫిభ్రవరి-మార్చి నెలల్లో కోతకు వస్తుంది. రెండు సార్లు దుక్కి దున్ని చదును చేసి ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు వేసి కలియ దున్నుకోవాలి… ఇందులో అంతర పంటలను కూడా సాగు చేయవచ్చు. అయితే మొక్కలు నాటుకున్న వెంటనే నీరు పెట్టాలి. నేల స్వభావం, వాతావరణ పరిస్థితులను బట్టి, 7-10 రోజుల కు ఒకసారి నీరు అందించాలి. పూత, కాపు సమయంలో 4-6 రోజుల కు అందించాలి.. కాపు అయ్యాక ఎప్పటికప్పుడు మొక్కలను కత్తిరించుకోవాలి.. మొక్క నాటిన 5-6 నెలలకు పంట చేతికి వస్తుంది. కాబట్టి, మొదటి 4 నెలలు అంతర పంటగా కూరగాయాలను వేసుకోవడం మంచిది.. ఇంకేదైనా సందేహాలు ఉంటే దగ్గరలోని వ్యవసాయ నిపుణులను అడిగి తెలుసుకోవచ్చు..