Site icon NTV Telugu

Hyderabad: నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం.. రూ.1.40కోట్ల విలువైన డ్రగ్స్, గంజాయి స్వాధీనం

Marijuna

Marijuna

డ్రగ్స్ యువత జీవితాలను చిత్తు చేస్తోంది. మాదకద్రవ్యాల కట్టడికి ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ పూర్తిస్థాయిలో అడ్డుకట్ట పడడం లేదు. హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. నార్కొటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్, నల్లకుంటా పోలీసులు జాయింట్ ఆపరేషన్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. రూ.1.40కోట్ల విలువైన డ్రగ్స్, గంజాయి స్వాధీనం చేసుకున్నారు అధికారులు. నగర అడిషనల్ సీపీ విశ్వప్రసాద్ దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు..

Also Read:NTR Neel: ఆ ఊరిలో ఎన్టీఆర్ – నీల్ షూట్

హైదరాబాద్ నార్కొటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్,నల్లకుంటా పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారని తెలిపారు.
వినియోగదారులు పేడ్లర్లుగా మారుతున్నారన్నారు. నల్లకుంటలో దాడులు నిర్వహించి డ్రగ్ పేడ్లర్ హర్షవర్ధన్, సప్లయ్ కం పేడ్లర్ శ్రీనివాస రాహుల్ లోకల్ పేడ్లర్స్ అభిషేక్, దవల్ ని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. డార్క్ వెబ్ ద్వారా పరిచయాలు పెంచుకుని పేడ్లర్ గా అభిషేక్ మారాడని వెల్లడించారు.

Also Read:Awake At Midnight: అర్ధరాత్రి దాటినా నిద్ర పొవట్లేదా? ఇక ఈ సమస్యలతో సతమతవాల్సిందే!

హర్షవర్ధన్ ప్రధాన అంతర్రాష్ట్ర పెడ్లర్ అని తెలిపారు. 1380 గ్రాముల హైడ్రోపోనిక్ గంజా( ఓజి కుష్), 44LSD బోల్ట్స్, 10వేల రూపాయలు క్యాష్, 6మొబైల్స్, 2ద్విచక్ర వాహనాలు, పార్కింగ్ మెటీరియల్స్ సీజ్ చేసామని తెలిపారు. మొత్తం పట్టుబడ్డ డ్రగ్ వాల్యూ 1.40కోట్లు ఉంటుందని వెల్లడించారు. స్నాప్ చాట్, వివిధ యాప్స్ ద్వారా డ్రగ్స్ అమ్మకాలు చేస్తున్నారు. చదువుకున్న యువత ఎక్కువగా మత్తుపదార్ధాలకు అలవాటు పడుతున్నారు.. పిల్లలపై తల్లిదండ్రులు దృష్టిసారించాలి.. హైదరాబాద్ లో డ్రగ్స్ తీసుకురావాలంటేనే భయపడుతున్నారు..

Also Read:Nani : సల్మాన్ ఖాన్ పై నాని సంచలన కామెంట్స్

మాధకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్నాం.. పోలీసులు కంట్రోల్ చేస్తున్నారు.. నిందితుడు హర్షవర్ధన్ ఒక్కో రోజే 10లక్షలు, మిగతా రోజుల్లో లక్షల్లో ట్రాన్సక్షన్ యాప్ ద్వారా బదిలీ చేసాడు.. డిటిడిసి కొరియర్ ద్వారా డ్రగ్స్ సప్లయ్ చేస్తున్నారు.. ఇందులో హవాలా ఆపరేటర్స్, క్రిప్టో కరెన్సీ ప్రమేయం ఉంది. నిందితుడు హర్షవర్దన్ శ్రీవాస్తవ జబల్పూర్, మధ్యప్రదేశ్ లో ఉంటాడు.. డబ్బు అవసరమయ్యే వ్యాపారాన్ని ప్రారంభించాడు.. సులభంగా డబ్బు సంపాదించాలని టార్గెట్ పెట్టుకున్నాడు.. Reddit కమ్యూనిటీ ద్వారా డ్రగ్‌ని ఎలా సేకరించాలి సరఫరా చేయాలో నేర్చుకున్నాడు అని సీపీ తెలిపారు.

Exit mobile version