Drugs Federals: అంతర్జాతీయ డ్రగ్ పెడ్లర్ ఆటకట్టించింది టీ న్యాబ్. నార్సింగ్ పోలీసులతో కలిసి చేసిన జాయింట్ ఆపరేషన్ లో ఓ నైజీరియన్ డ్రగ్ పెడ్లర్తోపాటు… ఇద్దరు లోకల్ డ్రగ్ పెడ్లర్లను పట్టుకున్నారు. పెద్దమొత్తంలో కోకైన్, ఎస్టసీ పిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. రేవ్ పార్టీలకు, సెలబ్రిటీలకు డ్రగ్స్ సప్లై చేసినట్లుగా గుర్తించిన పోలీసులు… కూపీ లాగుతున్నారు. హైదరాబాద్ మణికొండను అడ్డాగా చేసుకుని డ్రగ్స్ దందా చేస్తున్న ముఠాను పట్టుకున్నారు పోలీసులు. టీ న్యాబ్ పోలీసులు, నార్సింగ్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసి ముఠా ఆటకట్టించారు. నైజీరియాకు చెందిన డ్రగ్ పెడ్లర్తోపాటు.. ఇతడికి సహకరిస్తున్న ఇద్దరు లోకల్ పెడ్లర్లను అరెస్ట్ చేశారు పోలీసులు. అల్కాపురి టౌన్‌షిప్‌లోని ఓ లగ్జరీ విల్లాను అద్దెకు తీసుకుని.. ఇక్కడి నుంచే డ్రగ్స్ సప్లై చేస్తోంది ముఠా.
Read Also:Off The Record: సర్వెయర్ తేజేశ్వర్ హత్య.. ట్విస్టుల మీద ట్విస్టులు..!
నైజీరియాకు చెందిన విస్డమ్ ఒనేకా.. 2022 డిసెంబర్లో నకిలీ పాస్పోర్టుతో భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. సూడాన్ దేశస్తుడిగా దొంగ పాస్‌పోర్ట్ సృష్టించి.. స్టూడెంట్ వీసాపై గోవాకు వచ్చాడు. 2023లో నైజీరియాకు చెందిన దేశస్తుడిగా ఇమెకా డివైన్ పేరుతో పాస్‌పోర్ట్ పొందాడు. 2024 సెప్టెంబర్‌లో తిరిగి నైజీరియా వెళ్లిపోయిన ఒనేకా.. మూడు నెలల్లోనే తిరిగి ఇండియా వచ్చేశాడు. అది కూడా ఒరిజినల్ పేరుతో పాస్‌పోర్ట్ మీద వచ్చాడు. నైజీరియా నుంచి గోవా మీదుగా హైదరాబాద్‌కు డ్రగ్స్ తెప్పించాడు ఒమేకా. హైదరాబాద్‌లో మణికొండకు చెందిన వెడ్డింగ్ ప్లానర్ గోపిశెట్టి రాజేష్, వెస్ట్‌గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన బొమ్మదేవర వీరరాజును లోకల్ పెడ్లర్లుగా చేర్చుకున్నాడు. వీరి ద్వారా కస్టమర్లకు డ్రగ్స్ సప్లై చేశాడు ఒనేకా.
Read Also:Off The Record: కంటే కూతుర్నే కనాలి అంటారు.. కానీ ఉసురు తీసిన కూతురు
పక్కా సమాచారం అందుకున్న టీ న్యాబ్… నార్సింగ్ పోలీసులతో కలిసి ఒనేకా ఉంటున్న ఫ్లాట్‌పై రైడ్ చేపట్టింది. సోదాల్లో ఒనేకా నుంచి 107 గ్రాముల కొకైన్, 25 గ్రాముల ఎస్టసీ పిల్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. లోకల్ పెడ్లర్లు వీరరాజు, రాజేష్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. గత నెల అంటే.. మే 29న మొయినాబాద్ లోని ఓ ఫామ్ హౌజ్‌లో జరిగిన రేవ్ పార్టీకి కూడా డ్రగ్స్ సప్లై చేసింది ముఠా. ఫణిరాజ్ అనే వ్యక్తి నిర్వహించిన రేవ్ పార్టీకి సరఫరా చేసినట్లు విచారణలో గుర్తించారు పోలీసులు. ఇదే వ్యక్తికి మే 31న మంగళగిరిలో కూడా 15 గ్రాముల కొకైన్ సప్లై చేసినట్లు గుర్తించారు.
పలువురు సెలబ్రిటీలు, ప్రముఖుల పిల్లలకు కూడా ఒనేకా ముఠా నుంచి డ్రగ్స్ సరఫరా అయినట్లు గుర్తించారు పోలీసులు. కన్జూమర్ల కూపీ లాగుతున్నారు పోలీసులు. గోవాలో ఉన్న పెడ్లర్ల లింక్‌లను చేధిస్తున్నట్లు చెప్పారు రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్.