NTV Telugu Site icon

Election Commission: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో రూ.1760 కోట్లు పట్టివేత.. తెలంగాణలోనే అత్యధికం

Election Commission

Election Commission

Election Commission: ఐదు ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఉద్దేశించిన రూ.1,760 కోట్ల విలువైన ఉచితాలు, డ్రగ్స్, నగదు, మద్యం, విలువైన లోహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం సోమవారం వెల్లడించింది. 2018లో ఈ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జప్తు చేసిన జప్తుల కంటే ఏడు రెట్లు (గత ఎన్నికల్లో రూ. 239.15 కోట్లు) ఎక్కువ జప్తు చేసినట్లు పోల్ ప్యానెల్ తెలిపింది. ఈ వివరాలను అధికారికంగా కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. తెలంగాణలో అత్యధికంగా 225.25 కోట్ల నగదును సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరంలలో అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా, రాజస్థాన్, తెలంగాణలో నవంబర్ 25, నవంబర్ 30 తేదీల్లో పోలింగ్ జరగనుంది.

Also Read: PM MODI: ఓటమి బాధలో టీమిండియా ఆటగాళ్లు.. డ్రెసింగ్ రూమ్కు వెళ్లి ఓదార్చిన ప్రధాని

తెలంగాణలో మొత్తం 659 కోట్ల రూపాయల విలువ గల నగదు, మద్యం, డ్రగ్స్, గిఫ్ట్స్ పట్టుకున్నట్లు ఈసీ స్పష్టం చేసింది. రాజస్థాన్‌లో 93.17 కోట్లు, మధ్యప్రదేశ్‌లో 33.72 కోట్లు, పట్టుకున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం.. మిజోరాంలో నగదు లేదా విలువైన లోహం స్వాధీనం చేసుకోలేదు, అయితే ₹ 29.82 కోట్ల విలువైన డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికలు ముగిసే ఈ గణాంకాలు భారీగా పెరగనున్నాయి. ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో చీఫ్ సెక్రటరీలు డీజీపీలు, ఎక్సైజ్ కమిషనర్లు, ఇన్కమ్ టాక్స్ అధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతోంది. 228 మంది కేంద్ర ప్రభుత్వ ఉన్నత అధికారులను ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు అబ్జర్వర్లుగా నియమించింది. గతంలో నిర్వహించిన ఆరు రాష్ట్రాలు ఎన్నికల్లో వెయ్యి కోట్లు పట్టు పడగా… ఐదు రాష్ట్రాలకే ఇప్పుడు 1760 కోట్ల రూపాయలు విలువైన నగదు, మద్యం పట్టుబడినట్లు ఈసీ స్పష్టం చేసింది.

Show comments