NTV Telugu Site icon

Drug Smugglers: రూటు మార్చిన డ్రగ్ స్మగ్లర్స్.. ఏకంగా డార్క్ వెబ్ ద్వారా..

Drugs

Drugs

Drug Smugglers: డ్రగ్స్ కన్జ్యూమర్స్ ఇప్పుడు రూటు మార్చారు.. గోవాకు వెళ్లి డ్రగ్స్ తీసుకొని వస్తే పోలీసులు పట్టుకుంటున్నారు.. ఇతర రాష్ట్రాల్లోకి వెళ్లి డ్రగ్ సేవించి వచ్చిన అధికారుల నిగాతప్పడం లేదు ..డ్రగ్ టెస్టులు చేసి అరెస్టు చేస్తున్నారు.. వీటన్నిటిని కాదని ఇప్పుడు డ్రగ్స్ వినియోగదారులు కొత్త రూట్ నేర్చుకున్నారు ..సోషల్ మీడియాలో అత్యంత ఫేమస్ అయినా డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్ తెప్పించుకుంటున్నారు.. మారుమూల ప్రాంతాలకు సైతం ఈ డ్రగ్స్ చేరిపోతున్నాయి. డార్క్ వెబ్ మీద ఇప్పటికి ఎవరికి కూడా సరైన అవగాహన లేదు. అంతేకాదు దానిమీద సరేనా నిగా కూడా లేదు.. డార్క్ వెబ్లోకి ఒకసారి ఎంటర్ అయితే చాలు అక్కడ ఆ సాంఘిక కార్యక్రమాలకు అడ్డు అదుపు లేదు.. అక్కడ ఏదైనా దొరుకుతుంది.. అవసరమైన పక్షంలో మనుషులని చంపేసే వాళ్ళు కూడా కిరాయికి దొరుకుతారు.. అలాంటి డార్క్ వెబ్ లో ఏకంగా కొరియర్ల ద్వారా డ్రగ్స్ తెప్పించుకుంటున్నారు.

Love Suicide: ప్రేమ వేధింపులు తాళలేక బీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య..

ఖమ్మంకు సంబంధించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ప్రముఖ కంపెనీలో పని చేస్తారు.. వాళ్ళు హైదరాబాదులో ఉంటారు.. అయితే హైదరాబాద్ కి డ్రగ్స్ తెప్పించుకోవడం కష్టంగా ఉంటుంది.. ఈ నేపథ్యంలో వాళ్లు నేరుగా ఖమ్మంలో అన్ని తమ ఒక రహస్య ప్రాంతానికి డార్క్ వెబ్ లో ఆర్డర్ చేసుకున్నారు.. అది డార్క్ వెబ్ ద్వారా ఈ డ్రగ్స్ ని ఆర్డర్ చేసుకోవడం జరిగింది.. తెలంగాణ నార్కోటిక్ బ్యూరో డార్క్ వెబ్ పైన కూడా నిఘా పెట్టింది.. ఎవరైనా డార్క్ వెబ్బుల ద్వారా డ్రగ్స్ కోసం సెర్చ్ చేస్తే వాళ్ళ అని పూర్తిగా వారి కదలికలను పూర్తిగా ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టింది.. ఖమ్మం నుంచి డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్ ఆర్డర్ చేసినట్లు నార్కోటిక్ బ్యూరోకి సమాచారం అందింది.

Kevin Sullivan: ప్రముఖ రెజ్లింగ్ లెజెండ్ కెవిన్ సుల్లివన్ కన్నుమూత

డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్ తెప్పించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు.. అస్సాం నుంచి ఖమ్మం వరకు డ్రగ్స్ రప్పించుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్ ను ఆర్డర్ చేస్తున్న కన్జ్యూమర్లు. నార్కోటిక్ బ్యూరో వింగ్ ఇచ్చిన సమాచారంతో ఖమ్మం పోలీసుల ఆపరేషన్ చేశారు.. డ్రగ్స్ కు బానిసగా మారిన ఖమ్మం జిల్లాకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇదీ తెప్పించుకున్నట్లుగా తేలింది. జూలై 31న డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్ ఆర్డర్ చేసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కుమార్ అండ్ గ్యాంగ్.. డ్రగ్స్ కోసం క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లింపులు చేసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్.. అస్సాం నుండి స్పీడ్ పోస్టులో డ్రగ్స్ డెలివరీ చేశారు..

Maldives: త‌త్వం బోధ‌ప‌డింది.. భారత్ మా సన్నిహిత మిత్ర దేశమన్న ముయిజ్జూ..

న్యూస్ పేపర్ లో డ్రగ్స్ చుట్టి ప్లాస్టర్ అంటించిన వైనం ఇది.. ఈనెల 8న డ్రగ్స్ డెలివరీ చేస్తున్న క్రమంలో రెడ్ హ్యాండెడ్ గా సాప్ట్ వేర్ ఇంజినీర్ ను ఖమ్మం పోలీసులు పట్టుకున్నారు.. చాలామంది కూడా డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్ ని తెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని డార్క్ వెబ్ పైన కూడా తాము నిగా పెట్టామని పోలీస్ అధికారులు చెప్తున్నారు. మరోవైపు హైదరాబాద్ నుంచి న్యూజిలాండ్ కి మూడు కిలోల ఎపిడ్రిన్ డ్రగ్ నీ కొరియర్ చేసేందుకు ప్రయత్నం కొనసాగింది.. పంజాగుట్టలోని ఒక ఇంటర్నేషనల్ కొరియర్ ద్వారా ఈ డ్రగ్ ని విదేశాలకు పంపించేందుకు ప్రయత్నం చేశారు ఇద్దరు వ్యక్తులు.. మన దేశంలో ఉత్పత్తిని నిలిపివేసిన డ్రగ్ నేరుగా న్యూజిలాండ్ కి పంపించేందుకు ప్రయత్నం చేశారు ఇద్దరు వ్యక్తులు.. దీనికి సంబంధించి డైరెక్టరేట్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ బ్యూరోకి వచ్చిన సమాచారంతో పంజాగుట్టలోని ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ మీద పెట్టారు. కోట్ల రూపాయల విలువచేసే మూడు కిలోల ఏపిడ్రిన్ ట్రాలీ బ్యాగ్ లో దాచి కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేశారు.. ఇద్దరు వ్యక్తులు అందులో తీసుకొని మూడు కిలోల డ్రగ్ ను స్వాధీన పరచుకున్నారు.