హైదరాబాద్ లోని పలు బ్లడ్ బ్యాంకులపై డ్రగ్ కంట్రోల్ బ్యూరో ఆకస్మిక సోదాలు నిర్వహించారు. సికింద్రాబాద్, మెహదీపట్నం, బాలనగర్, హిమాయత్ నగర్, లక్డీకాపూల్, మలక్ పేట్, ఉప్పల్, చైతన్యపురి, కోఠిలోని 9 బ్లడ్ బ్యాంకుల్లో తనిఖీలు చేపట్టారు. ప్రమాణాలు పాటించని 9 బ్లడ్ బ్యాంకులకు నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా.. బ్లడ్ బ్యాంకుల నిల్వ, రక్త సేకరణ పరీక్షలలో పూర్తిగా లోపాలున్నట్లు డ్రగ్ కంట్రోల్ బ్యూరో గుర్తించింది. ప్లేట్ లెట్లు, ప్లాస్మా నిల్వలో పూర్తిగా లోపాలు గుర్తించింది. ఈ క్రమంలో.. 9 బ్లడ్ బ్యాంకులకు డ్రగ్ కంట్రోల్ బ్యూరో నోటీసులు ఇచ్చింది.
Read Also: Tammineni: పొత్తు ఉన్నా లేకున్నా రెండు స్థానాల్లో పోటీ చేస్తాం..
రక్తం సేకరించిన తర్వాత అందులోని ప్లేట్ లెట్లు, ప్లాస్మా నిల్వ చేసే సమయంలో లోపాలు ఉండడం వల్ల, ఆ రక్తం ఎక్కించిన రోగులకు పలు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని తరచుగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే డ్రగ్ కంట్రోల్ బ్యూరో సోదాలు చేపట్టింది. ఇదిలా ఉంటే.. ఇంతకుముందు సాధారణ తనిఖీల్లో భాగంగా డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఫిబ్రవరి 2న మూసాపేటలోని హీమో సర్వీసెస్ లాబోరేటరీలో తనిఖీలు చేపట్టిన సంగతి తెలిసిందే. సామర్థ్యానికి మించి నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. నిర్వాహకుడు రాఘవేంద్రనాయక్ అక్రమంగా ప్లాస్మాను నిల్వ చేసి, అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా.. శ్రీకర, న్యూలైఫ్ బ్లడ్ బ్యాంకుల నుంచి హోల్ బ్లడ్‌ను సేకరించి, ప్లాస్మాను వేరు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు నిర్ధారించారు.
Read Also: Purandeswari: పొత్తులు ఏ రకంగా ఉన్నా.. అన్ని పార్లమెంట్, అసెంబ్లీలో పోటీకి రెడీ..
డ్రగ్ కంట్రోల్ బ్యూరో సోదాలు చేసిన బ్లడ్ బ్యాంకులు ఇవే…!
1. శ్రీ బాలాజీ బ్లడ్ సెంటర్ (మలక్ పేట)
2. ఎంఎస్ఎన్ బ్లడ్ సెంటర్ (ఉప్పల్)
3. నవజీవన్ బ్లడ్ సెంటర్ (చైతన్యపురి)
4. నంది బ్లడ్ సెంటర్ (బాలానగర్)
5. ఏవీఎస్ బ్లడ్ సెంటర్ (లక్డీకాపూల్)
6. వివేకానంద బ్లడ్ సెంటర్ (మెహదీపట్నం)
7. రుధిర వాలంటరీ బ్లడ్ సెంటర్ (హిమాయత్ నగర్)
8. తలసేమియా రక్షిత బ్లడ్ సెంటర్ (కోఠి)
9. ప్రతిమ సాయి బ్లడ్ సెంటర్ (సికింద్రాబాద్)