Drone Attack on Dubai Airport: దుబాయ్ విమానాశ్రయంపై డ్రోన్ దాడి.. భయాందోళనలో ప్రయాణికులు..!
- దుబాయ్ విమానాశ్రయంపై డ్రోన్ దాడి..
- డ్రోన్ ఢీకొట్టడంతో విమానాశ్రయం సమీపంలో భారీ అగ్నిప్రమాదం
- విమానాశ్రయ కార్యకలాపాలు కొంతసేపు అంతరాయం
- భయాందోళనలో ప్రయాణికులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Drone Attack on Dubai Airport: ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వద్ద భద్రతా ఉల్లంఘన చోటుచేసుకుంది. డ్రోన్ దాడి కారణంగా విమానాశ్రయం సమీపంలో అగ్నిప్రమాదం సంభవించడంతో అక్కడి కార్యకలాపాలు కొంతసేపు అంతరాయం కలిగాయి. ఈ ఘటనతో అక్కడి ప్రజలు, ప్రయాణికులు భద్రతపై ఆందోళన చెందుతున్నారు. నేడు ఉదయం సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల్లో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో భారీగా పొగ ఎగసిపడుతున్న దృశ్యాలు కనిపించాయి. దీనిపై స్పందించిన దుబాయ్ మీడియా ఆఫీస్ అధికారులు ఒక డ్రోన్ విమానాశ్రయం సమీప ప్రాంతాన్ని ఢీకొట్టడంతో భారీగా అగ్నిప్రమాదం సంభవించిందని తెలిపారు.
Today Astrology: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభవార్తలే!
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదు. అయితే మంటల కారణంగా విమానాశ్రయ కార్యకలాపాలకు భారీగా అంతరాయం ఏర్పడింది. ఈ ఘటన కారణంగా విమానాశ్రయంలో రోజువారీ కార్యకలాపాలు స్తంభించాయి. పలు ఎయిర్ లైన్స్ తమ విమానాల షెడ్యూల్ లలో మార్పులు చేయాల్సి వచ్చింది. కొన్ని విమానాలు ఆలస్యంగా బయలుదేరగా, మరికొన్నింటిని ఇతర విమానాశ్రయాలకు మళ్లించారు.
డ్రోన్ దాడి జరిగిన వెంటనే అత్యవసర సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్నిమాపక సిబ్బంది, సివిల్ డిఫెన్స్ బృందాలు సమన్వయంతో పనిచేసి కొద్ది సమయంలోనే పరిస్థితిని నియంత్రించాయి. ప్రయాణికులు, విమానాశ్రయ సిబ్బంది భద్రతను దృష్టిలో ఉంచుకుని భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు. డ్రోన్ దాడి ఎలా జరిగింది, దాని వెనుక ఉన్న కారణాలు ఏమిటి అనే అంశాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. నష్టం ఎంత మేరకు జరిగిందో పూర్తిగా అంచనా వేసిన తరువాతే విమానాశ్రయం పూర్తిస్థాయి కార్యకలాపాలు సాధారణ స్థితికి వస్తాయని అధికారులు తెలియచేశారు.
తాజావార్తలు
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
-
NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
-
Russia: ప్రపంచానికి షాక్ ఇచ్చిన పుతిన్ ‘అణు’ బాంబ్.. ‘సర్మాట్’ క్షిపణితో సర్ప్రైజ్!
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!