Site icon NTV Telugu

Drishyam 3 Rights: కళ్లు చెదిరే ఆఫర్.. పనోరమా స్టూడియోస్‌‌కు ‘దృశ్యం3’ థియేట్రికల్‌ రైట్స్‌

Drishyam 3

Drishyam 3

Drishyam 3 Rights: దృశ్యం సినిమా ప్రాంఛైజీలకు ఉన్న అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డైరెక్టర్ జీతూ జోసెఫ్‌ – మోహన్‌లాల్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘దృశ్యం’ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద ఎంతటి ఘన విజయాన్ని అందుకున్నాయో అందరికీ తెలిసిందే. ఈ ప్రాంఛైజీలో ఇప్పటికే రెండు చిత్రాలు వచ్చాయి, ఇప్పుడు మూడో భాగం సిద్ధమవుతోంది. ఈ ‘దృశ్యం3’ సినిమా ప్రకటించినప్పటి నుంచి ప్రేక్షకులలో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే మలయాళంలో ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. అయితే ఇతర భాషలలో ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. ఈ చిత్ర నిర్మాణ సంస్థ ఆశీర్వాద్‌ మూవీస్‌ తాజాగా ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్‌, డిజిటల్‌ రైట్స్‌ను విక్రయించింది. వాస్తవానికి ఈ ఆఫర్ కళ్లు చెదిరేలా ఉంది.

READ ALSO: Cyclone Ditwah: ముంచుకొస్తున్న “దిట్వా” తుఫాన్.. తమిళనాడుకు హై అలర్ట్..

ఆశీర్వాద్‌ మూవీస్‌ దృశ్యం3 థియేట్రికల్‌, డిజిటల్‌ రైట్స్‌ను ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ, డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ అయిన పనోరమా స్టూడియోస్‌‌కు విక్రయించింది. ఈ డీల్ విలువ రూ.160కోట్లు అని సినీ వర్గాల సమాచారం. పనోరమా స్టూడియోస్‌‌ ఇప్పటి వరకు ఎక్కువగా హిందీ సినిమాలను డిస్ట్రిబ్యూట్‌ చేసింది. దీంతో ఈ సినిమాను మలయాళంతో పాటు, హిందీలోనూ ఒకేసారి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు టాక్ నడుస్తుంది. అయితే హిందీలో ఈ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు.. దీంతో మలయాళంలో ‘దృశ్యం3’ విడుదల కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉందనే సమాచారం. మరోవైపు తెలుగులో వెంకటేశ్‌ ఈ మూవీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్‌తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వెంకీ త్రివిక్రమ్ సినిమా చేస్తూనే దృశ్యం3 చేస్తారా లేదంటే.. లేదంటే ఫస్ట్ ఏ సినిమాకు డేట్లు సర్దుబాటు చేస్తారో చూడాలి.

READ ALSO: Tirumala Laddu Ghee Adulteration Case: తిరుమల కల్తీ నెయ్యి లడ్డు కేసులో మరో అరెస్టు !

Exit mobile version