Gold Sieze: భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్‌ఎఫ్) జాయింట్ ఆపరేషన్‌లో 15 కిలోల స్మగ్లింగ్ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్‌ఐ) ఆదివారం తెలిపింది. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ 9 కోట్ల విలువ చేస్తుందని అధికారులు తెలిపారు.
Read Also: Tejas Fighter Jet Deal: తేజస్ యుద్ధ విమానాల ఒప్పందం.. భారత్‌కు అర్జెంటీనా ఏం ఇస్తుందో తెలుసా?
పశ్చిమ బెంగాల్‌లోని నైడా అటవీ ప్రాంతంలో DRI , BSF అధికారుల జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. దట్టమైన అడవిలో స్మగ్లర్లు బంగారాన్ని దాచారని సమాచారం మేరకు అధికారులు అటవీ ప్రాంతంలో సోదాలు నిర్వహించారు. అధికారుల రాకను పసిగట్టిన కేటుగాళ్లు 106 బంగారు బిస్కెట్లను ఓ గుంతలో దాచిపెట్టారు. అనుమానం వచ్చిన అధికారులు గొయ్యిలో నుంచి బయటకు తీసి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని పంపిణీ చేసిన కీలక వ్యక్తిని, కీలక సహాయకుడిని ఆదివారం అరెస్టు చేసినట్లు డీఆర్ఐ అధికారులు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొ్న్నారు.