Site icon NTV Telugu

BCCI: క్రికెటర్లకు గుడ్ న్యూస్.. ప్రైజ్ మనీ డబుల్

Bcci

Bcci

BCCI: ప్రస్తుతం ఐపీఎల్ రసవత్తరంగా నడుస్తోంది. ఈ సమయంలోనే బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవాళీ క్రికెట్ టోర్నీల్లోని ఆటగాళ్లకు ఇచ్చే ప్రైజ్ మనీని రెట్టింపు చేస్తున్నట్లు ప్రకటించింది. ఐపీఎల్‌ ప్రారంభం కాగానే భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) ఆటగాళ్లకు ఈ భారీ బహుమతిని అందజేసింది. కొత్త నిర్ణయం ప్రకారం ఈ సంవత్సరం ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు ఐదు కోట్ల నగదు బహుమతి ఇవ్వబడుతుంది. ఇప్పటి వరకు రంజీ ట్రోఫీ టోర్నీ విజేతలకు రూ.2 కోట్లు బహుమతిగా ఇచ్చేవారు. ఇప్పుడు దానిని పెంచాలని నిర్ణయించారు. బిసిసిఐ సెక్రటరీ జై షా ఒక ట్వీట్‌లో, “దేశీయ క్రికెట్.. భారత క్రికెట్‌కు వెన్నెముక అ, అన్ని దేశీయ పోటీలకు ప్రైజ్ మనీని పెంచుతున్నట్లు ప్రకటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. దేశవాళీ క్రికెట్‌లో పెట్టుబడులు పెట్టడం కొనసాగిస్తాం. రంజీ విజేతలకు ఇప్పుడు రూ. 5 కోట్లు (రూ. 2 కోట్ల నుంచి), సీనియర్ గ్రూప్ మహిళా విజేతలు రూ. 50 లక్షలు (రూ. 6 లక్షల నుంచి) అందుకుంటారు. వచ్చే ఏడాది జనవరి 5 నుంచి రంజీ ట్రోఫీ ప్రారంభం కానుంది.

Read Also: CM YS Jagan: రేపు శ్రీకాకుళం జిల్లాలో సీఎం పర్యటన.. గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు నిర్మాణానికి శంకుస్ధాపన

ఇరానీ కప్ విజేతలకు రూ.25 లక్షల బదులు ఇప్పుడు రూ.50 లక్షలు బహుమతిగా ఇవ్వనున్నారు. రన్నరప్‌గా నిలిచిన వారికి ఇప్పుడు రూ.25 లక్షల బహుమతి లభిస్తుంది. రన్నరప్‌కు ఇంతకు ముందు నగదు బహుమతి రాలేదు. జూన్ 28న దులీప్ ట్రోఫీతో దేశవాళీ క్రికెట్ సీజన్ ప్రారంభం కానుంది. దులీప్ విజేతలకు కోటి రూపాయల బహుమతి, రన్నరప్‌కు 50 లక్షల రూపాయల బహుమతి లభిస్తుంది. విజయ్ హజారే ట్రోఫీ విజేతలకు రూ. కోటి, రన్నరప్‌లకు రూ. 50 లక్షలు, దేవధర్ కరందక్ విజేతలకు రూ. 40 లక్షలు, రన్నరప్‌కు రూ. 20 లక్షలు బహుమతిగా అందజేయనున్నారు. ఆ తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ పోటీల్లో విజేతలకు రూ.80 లక్షలు, రన్నరప్‌గా నిలిచిన వారికి రూ.40 లక్షలు బహుమతిగా అందజేస్తారు.

Read Also: NIA: భారత హైకమిషన్‌‌పై ఖలిస్తాన్ వేర్పాటువాదుల దాడి.. ఎన్ఐఏ విచారణ

Exit mobile version