Site icon NTV Telugu

Hyderabad: డబల్ బెడ్‌రూమ్‌లు ఇప్పిస్తామని మోసం.. పేదల నుంచి భారీగా వసూళ్లు..!

Double Bedroom

Double Bedroom

బండ్ల గూడలో డబల్ బెడ్‌రూమ్‌లు ఇప్పిస్తామని మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. పేదల నుంచి డబ్బులు వసూలు చేసిన గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. డబల్ బెడ్ రూమ్ సూపర్ వైజర్‌తో కుమ్మక్కైన మోసగాళ్లు ప్లాట్ బాధితులకు చూపించారు. 40 మంది బాధితులను మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఫిక్స్ యాప్ ద్వారా సర్టిఫికేట్‌లు తయారు చేశారు. డబల్ బెడ్ రూమ్ మంజూరు అయినట్లు సర్టిఫికేట్ క్రియేట్ చేశారు. నలుగురిని అరెస్ట్ చేసి 11 డూప్లికేట్ అలార్ట్మెంట్ సర్టిఫికెట్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడే కాకుండా.. ఇంకా పలు ప్రాంతాల్లో మోసాలు చేసినట్లు టాస్క్ ఫోర్స్ గుర్తించింది.

READ MORE: Nara Lokesh Meet Chirag Paswan: చిరాగ్ పాశ్వాన్‌తో మంత్రి లోకేష్ భేటీ.. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల అభివృద్ధికి సహకరించండి..

మరోవైపు.. తెలంగాణలో అసంపూర్తిగా ఉన్న 69 వేల రెండు పడక గదుల (డబుల్ బెడ్‌రూం ) ఇళ్లను లబ్ధిదారు నేతృత్వంలో నిర్మాణం పద్ధతిలో పూర్తి చేస్తామని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ ఇళ్ల నిర్మాణం కోసం అర్హులైన లబ్ధిదారులకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని వెల్లడించారు. సోమవారం (జూన్ 16) సచివాలయంలో ఇందిరమ్మ ఇళ్లు, రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం, మౌలిక వసతులపై అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్ష నిర్వహించి ఈ వ్యాఖ్యలు చేశారు.

READ MORE: Iran: ‘‘లొంగిపోము, జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలు’’.. ట్రంప్‌కి సుప్రీంలీడర్ ఖమేనీ వార్నింగ్..

Exit mobile version