Site icon NTV Telugu

Congress Petition: వ్యూహం సినిమాకి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వొద్దు.. కాంగ్రెస్ పిటిషన్

Vyham

Vyham

Congress Petition: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘వ్యూహం’ చిత్రం మరో వివాదంలో చిక్కుకుంది. ఇటీవల ఈ చిత్రంపై నారా లోకేశ్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ పార్టీ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. వ్యూహం సినిమాకి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వద్దని ఏపీ హైకోర్టులో కాంగ్రెస్ పార్టీ పిటిషన్ వేసింది.

Read Also: MLA Parthasarathy: సీఎం నన్ను గుర్తించకపోవడం దురదృష్టకరం

వ్యూహం చిత్రం సెన్సార్ సర్టిఫికెట్ ను పునఃసమీక్షించాలంటూ ఏపీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మీసాల రాజేశ్వరరావు హైకోర్టులో పిటిషన్ వేశారు. సినిమాలో సోనియా గాంధీ, మాజీ మంత్రి రోశయ్య పాత్రలు సినిమాలో టీజర్ లో ఉన్నాయని పిటిషనర్ తెలిపారు. ఈ చిత్రంలోని పాత్రలు సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ పరువుకి నష్టం కలిగేలా ఉన్నాయని పిటిషన్ లో పేర్కొన్నారు. కాగా.. ఈ పిటిషన్ పై ఏపీ హైకోర్టు రేపు విచారణ చేపట్టనుంది.

Read Also: US-North Korea: ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడొద్దు.. అమెరికాకు కిమ్ స్ట్రాంగ్ వార్నింగ్

Exit mobile version