Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్‌తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dondakaya Roti Pachadi Recipe: తెలుగు వారి ఇళ్లలో పచ్చళ్లకు ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. అందులోనూ రోటి పచ్చడికి ఉండే రుచి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాధారణంగా దొండకాయతో కూరలు, వేపుళ్లు చేస్తుంటారు. కానీ దొండకాయ, టమాటాతో చేసే రోటి పచ్చడి మాత్రం ఒకసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ చేయాలనిపించేలా ఉంటుంది. వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ పచ్చడిని తింటే ఆ రుచి అమోఘం అంతే.. దీనిని ఇడ్లీ, దోశ వంటి టిఫిన్స్‌కు కూడా ఈ పచ్చడి అద్భుతంగా ఉంటుంది. ఫ్రిజ్‌లో నిల్వ ఉంచితే 4 రోజుల వరకు తాజాగా ఉంటుంది. మరి ఈ టేస్టీ దొండకాయ రోటి పచ్చడిని ఎలా చేయాలో చూసేద్దామా..
కావలసిన పదార్థాలు:
* దొండకాయలు – పావు కేజీ
* పెద్ద టమాటాలు – 2
* పచ్చిమిర్చి – 12 నుంచి 15
* వేరుశనగ (పల్లీలు)– 1 టేబుల్ స్పూన్
* వెల్లుల్లి రెబ్బలు – 3 నుంచి 4
* చింతపండు – చిన్న ముక్క
* కొత్తిమీర – కొద్దిగా
* నూనె – 2 టేబుల్ స్పూన్లు
* ఉప్పు – తగినంత
Also Read
- ED Raids: హైదరాబాద్‌లో ఈడీ సోదాలు.. అమెరికన్లనే టార్గెట్‌గా మోసాలు.!
- 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, 165Hz రిఫ్రెష్ రేట్ తో రాబోతున్న iQOO Z11 5G..!
- Ind vs SL: 'జడేజా' రీఎంట్రీ.. శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టు ప్రకటన.!
- AP Weather Update: తీరం దాటిన తీవ్ర వాయుగుండం.. ఉత్తరాంధ్రలో మోస్తరు వర్షాలు!
తయారీ విధానం:
ముందుగా దొండకాయలను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమాటాలను కూడా కొంచెం పెద్ద ముక్కలుగా కోసి సిద్ధం పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్‌పై కడాయి పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత దొండకాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు వేసి బాగా కలపాలి. తర్వాత మూత పెట్టి మీడియం మంటపై మగ్గించాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. దొండకాయలు, టమాటాలు బాగా మెత్తబడుతూ కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఇలా బాగా ఫ్రై అయితేనే పచ్చడికి మంచి రుచి వస్తుంది. ముక్కలు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి.
ఇంతలో మరో చిన్న పాన్‌లో పల్లీలను దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో వేయించిన పల్లీలు, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు వేసి ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. ఆ తర్వాత చల్లారిన దొండకాయ, టమాటా మిశ్రమాన్ని జార్లో వేసి తగినంత ఉప్పు కలపాలి. పచ్చడిని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉండేలా మిక్సీ పట్టాలి. అలా చేస్తేనే రోటి పచ్చడికి అసలైన టెక్స్చర్ వస్తుంది. రోట్లో నూరితే మరింత రుచిగా ఉంటుంది.
చివరగా పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకుని సన్నగా తరిగిన కొత్తిమీర కలపాలి. అంతే.. నోరూరించే దొండకాయ టమాటో రోటి పచ్చడి రెడీ. ఈ పచ్చడిని వేడి అన్నం, నెయ్యితో తింటే అదిరిపోయే రుచి వస్తుంది. అలాగే ఇడ్లీ, దోశ, చపాతీతో కూడా చాలా బాగుంటుంది. ఇంట్లో ఒక్కసారి ట్రై చేస్తే మీ ఫ్యామిలీకి ఖచ్చితంగా ఫేవరెట్ అయిపోతుంది.
తాజావార్తలు
-
ED Raids: హైదరాబాద్‌లో ఈడీ సోదాలు.. అమెరికన్లనే టార్గెట్‌గా మోసాలు.!
-
Sridevi: వర్షంలో 15 ఏళ్ల శ్రీదేవితో 55 ఏళ్ల హీరో రొమాన్స్ .. అప్పట్లో సంచలనం సృష్టించిన కల్ట్ క్లాసిక్ సాంగ్ ఏంటో తెలుసా ?
-
Speed Post New Rates: తపాలా శాఖ కీలక ప్రకటన.. స్పీడ్ పోస్ట్ సేవలకు కొత్త ధరలు.. లేఖలు, పార్శిల్స్ పై కొత్త నిబంధనలు
-
Vaibhav Sooryavanshi-BCCI: వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ.. బీసీసీఐకి పెద్ద తలనొప్పి!
-
3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, 165Hz రిఫ్రెష్ రేట్ తో రాబోతున్న iQOO Z11 5G..!
ట్రెండింగ్
-
Saransh Jain: భారత జట్టులోకి దేశవాళీ మాన్స్టర్.. ఎవరీ సరాంశ్ జైన్?.. అంత తోపు ప్లేయరా?
-
Sanju Samson: ఎలుకల పందెంలో పరుగెత్తలేను.. ఎలా ఆడాలో ఎవరూ చెప్పక్కర్లేదు.. సంజు సంచలన వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ చేసిన POCO M8 Power 5G.!
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్‌మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!