America vs Iran: ఇరాన్‌తో అణు ఒప్పందం చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో అతడు మధ్యప్రాచ్యాన్ని ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. అదో ప్రమాదకరమైన ప్రాంతం అని పేర్కొన్నారు. తమ సైనిక సిబ్బందిని అక్కడి నుంచి తరలిస్తున్నాం.. ఆ ప్రాంతాన్ని వీడాలని యూఎస్ ఆర్మీకి నోటీసులు జారీ చేశాం.. ఏం జరుగుతుందో చూడాలని ఆయన తెలిపారు. ఈ ఉద్రిక్తతలు తగ్గాలంటే ఇరాన్ అణ్వాయుధాన్ని కలిగి ఉండకూడదని వార్నింగ్ ఇచ్చాడు. అణు చర్చలు విఫలమైతే, ఇరాన్‌పై దాడులు చేస్తామని ట్రంప్ పదే పదే హెచ్చరికలు చేశాడు.
Read Also: Lok Sabha Elections: నారీమణులకు కేంద్రం గుడ్‌న్యూస్..! వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో..!
ఈ నేపథ్యంలో తమపై దాడులు జరిగితే ఈ ప్రాంతంలోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామని ఇరాన్ రక్షణ మంత్రి అజీజ్ నసీర్జాదే వార్నింగ్ ఇచ్చారు. ఈ హెచ్చరికల నేపథ్యంలోనే యూఎస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా, కువైట్‌లోని అమెరికా రాయబార కార్యాలయం బుధవారం నాడు ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. అందులో తమ సిబ్బందిని ఎక్కడికీ తరలించడం లేదని వెల్లడించింది. అయితే, కువైట్ అధికారులు మాత్రం దీనికి భిన్నంగా ట్రావెల్ అడ్వైజరీని విడుదల చేశారు. ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో అత్యవసరంగా అమెరికా సిబ్బంది ఆ ప్రాంతాన్ని వీడిచి పెట్టాలని కోరింది. మరోవైపు, ఇరాన్‌పై దాడికి ఇజ్రాయెల్ రెడీ అవుతున్నట్లు పలు మీడియాల్లో న్యూస్ ప్రసారం అవుతుంది. ఈ నేపథ్యంలో తమ బలగాలను వెనక్కి రప్పించాలని అమెరికా నిర్ణయించుకోవడం గమనార్హం.
