అమెరికన్ టాప్ పోర్న్ స్టార్ కు అక్రమ చెల్లింపుల వ్యవహారంలో అరెస్ట్ ను ఎదుర్కొంటున్న వేళ.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. కోర్టులో లొంగిపోనున్నారు. తన అరెస్ట్ తప్పదంటూ ఆయన ఇది వరకే క్లారిటీ ఇచ్చారు. తనకు అండగా నిలవాలంటూ మద్దతుదారులకు పిలుపునిచ్చారు. నిరసన ప్రదర్శనలను చేయాలని సూచించారు. అక్రమ చెల్లింపుల కేసులో మన్ హట్టన్ న్యాయస్థానం తీర్పు వెలువరించే అవకాశం ఉన్న నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
Read Also : Dasara: వెన్నెల డాన్స్ ఇంకా బుర్రలో తిరుగుతూనే ఉంది మాష్టారు…
డానాల్డ్ ట్రంప్ పై ఉన్న ఆరోపణలు రుజువైతే అమెరికాలో ఒక మాజీ అధ్యక్షుడికి ప్రత్యక్ష ప్రమేయం ఉన్న తొలి క్రిమినల్ కేసు ఇదే అవుతుంది. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ట్రంప్ పోటీ చేశాడు. ఆ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఎన్నికల కంటే ముందే టాప్ అమెరికన్ పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ తో తనకు ఉన్న సంబంధాలు బయటికి రాకుండా జాగ్రత్తపడ్డారు.
Read Also : Mughals Out Of Syllabus: సీబీఎస్ సిలబస్ నుంచి మొఘలుల చరిత్ర తొలగింపు..
దీనికోసం తన తరపు అడ్వొకేట్ ను మధ్యవర్తిగా పెట్టి-ఆమెకు పెద్ద మొత్తంలో డబ్బులను చెల్లించాలరనేది ట్రంప్ ఉన్న ఆరోపణలు. 2006లో ట్రంప్ తనతో పడుకున్నారని స్టార్మీ డేనియల్స్ ఇటీవలే బయటపెట్టారు. అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆ విషయాన్ని బయటపెట్టకుండా ఉండటానికి బెదిరించారని, తాను నోరెత్తకుండా ఉండటానికి 1.30 లక్షల డాలర్లు ఇచ్చారని స్పష్టం చేశారు. ఈ కేసును మన్ హట్టన్ క్రిమినల్ కోర్టు విచారణ కొనసాగిస్తో్ంది.
Read Also : 10th answer sheets Missing: ఆదిలాబాద్‌లో పదోతరగతి ఆన్సర్ షీట్స్ మిస్సింగ్..!
ఈ కేసులో కోర్టు తనను దోషిగా తేల్చిన వెంటనే లొంగిపోవాలని ట్రంప్ నిర్ణయించుకున్నారు. దీని కోసం ఇప్పటికే ఆయన న్యూయార్క్ కు చేరుకున్నారు. తాను నివసిస్తోన్న వెస్ట్ పామ్ బీచ్ నుంచి ప్రైవేట్ ప్లైట్ లో ట్రంప్ న్యూయార్క్ లోని లాగ్వార్డియా ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ట్రంప్ తరపున వైట్ కాలర్ క్రిమినల్ డిఫెన్స్ లాయర్ టాడ్ బ్లాంచె.. మన్ హట్టన్ కోర్టులో వాదించనున్నారు.
Read Also : Road Accident: దెందులూరులో హైవేపై ప్రైవేట్ ట్రావెల్స్ బోల్తా
విచారణ కొనసాగే సమయంలో కోర్టు రూమ్ కు మీడియా ప్రవేధాన్ని నిషేధించాని వినతి చేశారు. వీడియో, ఫోటో, రేడియో కవరేజీని అనుమతించవద్దని కోరారు. లొంగిపోయిన తరువాత కూడా ట్రంప్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు బయటపెట్టొద్దని అభ్యర్థించారు. కాసేపట్లో విచారణ కొనసాగనుంది. ట్రంప్ అరెస్ట్ తప్పదంటూ అమెరికన్ మీడియా అభిప్రాయపడుతుంది. అందుకే న్యాయస్థానం తనను దోషిగా తేల్చిన వెంటనే లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది.
Read Also : Astrology : ఏప్రిల్ 4, మంగళవారం దినఫలాలు
డొనాల్డ్ ట్రంప్ కోర్టుకు హాజరు కానున్నందున న్యూయర్క్ పోలీసులు ముందు జాగ్రత్త చర్యలను తీసుకున్నారు. మన్ హట్టర్ న్యాయస్థానం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. బారికేడ్లను అమర్చారు. న్యాయస్థానానికి దారి తీసే మార్గాలన్నింటినీ మూసివేశారు. వీఐపీలు రాకపోకలు సాగించడినికి మాత్రమే అనుమతి ఇచ్చారు. కోర్టుకు వచ్చే అన్ని దారుల్లో పెద్ద ఎత్తున సాయుధ పోలీసు బలగాలు మోహరించాయి. ఎలాంటి అవాంఛనీయ పరిస్థితి తలెత్తినా తక్షణమే స్పందించేలా చర్యలు చేపట్టారు.