NTV Telugu Site icon

Donald Trump On Tiktalk: టిక్‌టాక్ నిషేధంపై డొనాల్డ్ ట్రంప్ మనసు మార్చుకుంటున్నారా?

Tiktalk

Tiktalk

Donald Trump On Tiktalk: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్, టిక్‌టాక్‌పై నిషేధాన్ని నిలిపివేయాలని సుప్రీం కోర్టును కోరారు. టిక్‌టాక్‌ను నిషేధించే చట్టాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని, సమస్యకు రాజీ పరిష్కారం సాధించేందుకు మరికొంత సమయం కావాలని ఆయన అభ్యర్థించారు. జనవరి 19, 2025 వరకు నిషేధ గడువును పొడిగించాలని ట్రంప్ కోరుతున్నారని తెలుస్తోంది. ట్రంప్ తన మొదటి పదవీకాలంలో టిక్‌టాక్‌ను నిషేధించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే, 2024 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో యువ ఓటర్లను, ముఖ్యంగా పురుష ఓటర్లను ఆకర్షించడానికి టిక్‌టాక్‌ను వేదికగా ఉపయోగించారు. టిక్‌టాక్‌ను జాతీయ భద్రతకు ముప్పుగా పేర్కొన్నప్పటికీ, ప్రస్తుతం నిషేధాన్ని వ్యతిరేకిస్తున్నారు.

Also Read: Manmohan Singh: కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న మన్మోహన్ సింగ్ భౌతికకాయం

అమెరికా ప్రభుత్వం టిక్‌టాక్ జాతీయ భద్రతకు ముప్పు అని చెబుతుండగా, టిక్‌టాక్ తమ ప్లాట్‌ఫారమ్‌పై నిషేధాన్ని కోర్టు రద్దు చేయాలని కోరింది. ఈ చట్టం రద్దు చేయకపోతే అది తమపై అన్యాయం చేసే విధంగా ఉంటుందని టిక్‌టాక్ పేర్కొంది. ట్రంప్ ఇప్పుడే ప్రమాణస్వీకారం చేయకముందే, జాతీయ భద్రత సహా పలు కీలక అంశాల్లో జోక్యం చేసుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. విదేశీ నాయకులు, వ్యాపార అధికారులతో ట్రంప్ ఫ్లోరిడాలోని తన మార్-ఎ-లాగో క్లబ్‌లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల టిక్‌టాక్ సీఈవో షా చ్యూతో సమావేశమవడం కూడా ఈ చర్యలలో భాగమని సమాచారం. ట్రంప్, టిక్‌టాక్‌పై తీసుకునే నిర్ణయం యువతపై, టెక్నాలజీ రంగంపై, అంతర్జాతీయ సంబంధాలపై కూడా ప్రభావం చూపనుంది. టిక్‌టాక్ నిషేధానికి సంబంధించిన చట్టంపై సుప్రీం కోర్టు తీర్పు ఎలా ఉంటుందో అన్నది ఆసక్తికరంగా మారింది.